NTV Telugu Site icon

భారత్‌లో ‘బిడెన్’ ఫ్యామిలీ.. 1873 నుంచీ..!

నాగ్‌పూర్: అమెరికా అధ్యక్షుడు జోబిడెన్‌ బంధువులు నాగ్‌పూర్‌లో నివశిస్తున్నారు. అది కూడా ఒకటి, రెండేళ్ల నుంచి కాదు. ఏకంగా రెండు శతాబ్దాల నుంచి. జో బిడెన్ ముది ముత్తాతల నాటి నుంచీ వీరికి చుట్టరికం ఉంది. ఈ విషయం గురించే 1981లో వీరు జో బిడెన్‌కు లేఖ కూడా రాశారు. ప్రస్తుతం జో బిడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో నాగ్‌పూర్‌లోని ఈ ఫ్యామిలీ తెరమీదకొచ్చింది. తాము భారత్‌లో 1873 నుంచి నివశిస్తున్నామని, ముంబైలో కూడా బంధువులు ఉన్నారని ముని మనుమరాలు సోనియా తెలిపారు. ఒక్క భారత్‌లోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ దేశాల్లో కూడా తమ వంశస్థులు ఉన్నారని చెప్పుకొచ్చారు.