Mirchi Rate: ఇది చాలా హాట్ గురూ… మిరపకాయ ధర రూ.7000
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mirchi Rate: ద్రవ్యోల్బణం కారణంగా దేశంలో సామాన్యులు నానాఇబ్బంది పడుతున్నారు. పాలు, పెరుగు, గోధుమలు, పిండి, బియ్యం, పప్పులతో సహా అన్ని రకాల ఆహార పదార్థాలు ఖరీదుగా మారాయి. కానీ, చాలా మసాలా దినుసుల అధిక ధర సామాన్య ప్రజలను కంటతడి పెట్టిస్తోంది. గత కొన్ని నెలల్లో మసాలా దినుసుల ధర రెండింతలు పెరిగింది. ముఖ్యంగా జీలకర్ర కిలో 1200 నుంచి 1400 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అదేవిధంగా ఎర్ర మిరపకాయ కూడా చాలా ఖరీదైనదిగా మారింది. కిలో రూ.400 అయింది. కాగా గతేడాది వరకు కిలో ధర రూ.100 మాత్రమే. కానీ ఓ రకమైన మిర్చి ప్రపంచంలో అత్యంత ఘాటైన మిరపకాయలలో ఒకటిగా నిలిచింది. దీంతో పాటు దీని రేటు కూడా దాదాపు కిలో వేల రూపాయలు ఉంటుంది.
దాని పేరే ‘భూత్ జోలోకియా’. ప్రపంచంలోనే అత్యంత ఘాటైన ఎర్ర మిరపకాయ ఇదేనని చెబుతున్నారు. ఒక్క సారి తిన్న తర్వాత చెవిలోంచి పొగలు రావడం ఖాయం. దాని ధర వింటే మీ మనస్సు గందరగోళానికి గురవడం గ్యారెంటీ. విశేషమేమిటంటే, ‘భూత్ జోలోకియా’ భారతదేశంలో మాత్రమే సాగు చేయబడుతుంది. నాగాలాండ్‌లోని కొండ ప్రాంతాలలో మాత్రమే రైతులు దీనిని సాగు చేస్తారు. భూత్ జోలోకియా దాని ఘాటు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది.
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
Read Also:Sai Stotram: శ్రావణ గురువారం అభిషేకం వీక్షిస్తే ఇంట సుఖసంతోషాలు
మిరపకాయల పొడవు 3 సెం.మీ
ఇది చాలా రకాల ఎర్ర మిరపకాయలు. ఇది చాలా తక్కువ సమయంలో తయారు చేయబడుతుంది. మొక్కలను నాటిన 90 రోజుల తర్వాత మాత్రమే పంట పూర్తిగా సిద్ధమవుతుంది. అంటే మీరు తినడానికి భూత్ జోలోకియా మొక్కల నుండి ఎర్ర మిరపకాయలను తీయవచ్చు. ఇటువంటి భూత్ జోలోకియా సాధారణ ఎర్ర మిరపకాయల కంటే పొడవు తక్కువగా ఉంటుంది. దీని పొడవు 3 సెం.మీ వరకు ఉంటుంది. వెడల్పు 1 నుండి 1.2 సెం.మీ.
పెప్పర్ స్ర్పే తయారీ
పెప్పర్ స్ప్రే కూడా ‘భూత్ జోలోకియా’ నుండి తయారు చేయబడుతుంది. మహిళలు తమ భద్రత కోసం దీనిని ఉంచుకుంటారు. ప్రమాదంలో ఉన్నప్పుడు మహిళలు పెప్పర్ స్ప్రేని ఉపయోగిస్తారు. దీంతో హాని చేయాలనుకున్న వారి గొంతులో, కళ్లలో మంటలు వస్తున్నాయి. నాగాలాండ్‌లో రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తారు. దీనిని ఘోస్ట్ చిల్లీ, నాగా జోల్కియా లేదా ఘోస్ట్ పెప్పర్ అని కూడా అంటారు.
Read Also: Salaries in Advance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూ్స్.. ఈ రాష్ట్రాల్లో ముందుగానే జీతాలు
కిలో భూత్ జోలోకియా ఖరీదు రూ.7000
భూత్ జోలోకియాకు 2008లో జీఐ ట్యాగ్ లభించింది. 2021 సంవత్సరంలో జోలోకియా మిరపకాయలు భారతదేశం నుండి లండన్‌కు ఎగుమతి చేయబడ్డాయి. విశేషమేమిటంటే భూత్ జోలోకియా సాధారణ ఎర్ర మిరపకాయల కంటే చాలా ఖరీదైనది. ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్‌లో 100 గ్రాముల భుట్ జోలోకియా మిర్చి ధర రూ.698గా ఉంది. ఈ విధంగా ఒక కేజీ భూత్ జోలోకియా ధర రూ.6980 అయింది.
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!