Site icon NTV Telugu

కోవాగ్జిన్ పై భార‌త్ బ‌యోటెక్ కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

కోవాగ్జిన్ టీకాపై భారత్‌ బయోటెక్‌ కీలక ప్రకటన చేసింది. కోవిడ్ తీవ్ర లక్షణాలు సోకకుండా కోవాక్సిన్ 93.4 శాతం కాపాడుతుందని.. ప్రకటించింది భారత్ బయోటెక్. కోవాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయిల్ డేటాను లాన్‌సెట్‌ ప్రచురించిందని… క్లినికల్ ట్రాయల్స్ లో పాల్గొన్న వారిలో 0.5% కంటే తక్కువ మందిలో తీవ్ర దుష్పరిణామాలు ఉన్నాయని తెలిపింది. డెల్టా వేరియంట్ సోకకుండా 65.2 శాతం కాపాడగలదని పేర్కొంది భారత్ బయోటెక్. అన్ని రకాల కోవిడ్ స్ట్రైన్స్ నుంచి 70.8 శాతం రక్షణ ఇస్తుందని స్పష్టం చేసింది భారత్ బయోటెక్. భారత్ బయోటెక్ కోవాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు ఐసీఎంఆర్ డిజి బలరాం భార్గవ.

Exit mobile version