NTV Telugu Site icon

Kalki 2898AD: కల్కి నుంచి భైరవ ఆంథమ్ ప్రోమో వచ్చేసింది చూశారా..

Bhairava Anthem

Bhairava Anthem

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ” కల్కి 2898 AD “. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈ సినిమా లో అమితాబ్ ,కమల్ వంటి లెజెండరీ స్టార్స్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

సినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి . తాజాగా భైరవ ఆంథమ్ పేరుతో ఒక సాంగ్ ప్రోమో ని విడుదల చేసింది. ఫుల్ సాంగ్ ని రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు, అయితే ఈ పాటను ప్రముఖ సింగర్ డిల్జిత్ దోసఙ్హ్ పాడారు. ప్రోమో విడుదలైన క్షణాల్లోనే భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది.. ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..