Site icon NTV Telugu

Bhagavanth Kesari : బాలయ్య మూవీ వాయిదా పడనుందా..?

Whatsapp Image 2023 09 16 At 8.29.46 Am

Whatsapp Image 2023 09 16 At 8.29.46 Am

నందమూరి నట సింహం బాలయ్య సినిమా వస్తుంది అంటే భాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలు ఉంటాయి. బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భగవంత్‌ కేసరి’.. ఈ చిత్రంతో దసరా బరిలో దుమ్ములేపేందుకు సిద్ధమవుతున్నారు బాలయ్య.ఈ చిత్రాన్ని అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో బాలయ్య సరసన కాజల్‌ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురు పాత్రలో నటిస్తుంది.బాలీవుడ్ యాక్టర్ అర్జున్‌ రాంపాల్‌ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.. ఇప్పటికే ఈ చిత్ర విడుదల తేదీని కూడా చిత్ర యూనిట్ ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబరు 19న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామన్నారు. ‘భగవంత్‌ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది’ గన్స్‌ పట్టుకుని బాలకృష్ణ నడిచి వస్తున్న ఫొటోతో ఫ్యాన్స్ లో తెగ జోష్ నింపారు.

అయితే నాలుగు రోజులు క్రితం వరకు అంతా అనుకున్నట్లే జరుగుతుందని దసరాకు బాలయ్య సినిమా రికార్డ్స్ సృష్టిస్తుంది అని అభిమానులు లెక్కలు వేసారు. అయితే అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఎదురవబోతుంది.సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘భగవంత్‌ కేసరి’వాయిదా పడే అవకాసం ఉందని తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన నేపధ్యంలో బాలయ్య ఇప్పుడు తెలుగు దేశం పార్టీ తరుపున లీడ్ తీసుకోవటం చేస్తున్నారు. దాంతో ఇంకా షూటింగ్ పెండింగ్ ఉన్న ‘భగవంత్‌ కేసరి’ని అనుకున్న సమయానికి విడుదల అవడం కష్టమనే మాట వినపడుతోంది. అయితే  అనీల్ రావిపూడి మాత్రం బాలయ్యలేని సీన్స్ షూట్స్ ప్లాన్ చేసి ఫినిష్ చేస్తున్నట్లు సమాచారం.. ఈ చిత్ర షూటింగ్ కు బాలయ్య మరో ఐదారు రోజులు డేట్స్ కేటాయిస్తే షూటింగ్ ఫినిష్ అవుతుందని సమాచారం.అదే నిజమైతే సినిమా రిలీజ్ ఫోస్ట్ ఫోన్ అవసరం అయితే ఉండదు.విజయ్ లియో, రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు షెడ్యూల్ ప్రకారమే థియేటర్స్ లోకి వచ్చేస్తున్నాయి. మరి అనుకున్న సమయానికి బాలయ్య వస్తాడో లేదో చూడాలి

Exit mobile version