నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి.. ఈ సినిమాను తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఆదివారం రిలీజైన ట్రైలర్ బాలకృష్ణ అభిమానులతో పాటు తెలుగు ఆడియెన్స్‌ను కూడా ఎంతగానో మెప్పిస్తోంది. ఈ ట్రైలర్ లో తెలంగాణ స్లాంగ్‌లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ మరియు ఆయనపై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ ఎంతో హైలైట్‌గా నిలిచాయి.. అయితే విడుదలకు ముందే భగవంత్ కేసరి ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ పూర్తయినట్లు సమాచారం.ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో 18 కోట్ల కు దక్కించుకున్నట్లు సమాచారం..
బాలకృష్ణ అఖండ మరియు వీరసింహారెడ్డి సినిమాలు సక్సెస్ కావడంతో భగవంత్ కేసరి ఓటీటీ హక్కుల కోసం భారీ పోటీ ఏర్పడినట్లు తెలిసింది. చివరకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం.భగవంత్ కేసరి శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానెల్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురిగా నటిస్తుంది.అయితే బాలకృష్ణ,కాజల్ కాంబినేషన్‌లో వస్తోన్న ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం.భగవంత్ కేసరి సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తున్నాడు.ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు..అలాగే బాలయ్య తన తరువాత సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తో చేస్తున్నారు. NBK109 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రారంభం అయింది. ఈ సినిమాలో బాలయ్యను దర్శకుడు బాబీ మరింత కొత్తగా చూపించనున్నట్లు సమాచారం.
