Site icon NTV Telugu

BEL Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బెల్ లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ..

Jobs

Jobs

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా మరో శాఖ లో ఉన్న పలు పోస్టుల కు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. బెల్ లో ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ టెక్నీషియన్, ప్రొబేషనరీ ఇంజనీర్ మొదలైన వివిధ పోస్టుల భర్తీ చేపట్టనుంది.. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వనిస్తోంది.. ఈ నోటిఫికేషన్ ను తన వెబ్ సైట్ లో చెప్పుకొచ్చింది.. గతంలో కన్నా ఎక్కువగా పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఇప్పటికే పలు శాఖల్లో నోటిఫికేషన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే..

ఇందులో 34 డిప్యూటీ ఇంజనీర్ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల ఖాళీలకు సంబంధించి డిప్యూటీ ఇంజనీర్ (మెకానికల్)18 ఖాళీలు, డిప్యూటీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) 16 ఖాళీలు ఉన్నాయి.. అర్హతల విషయానికొస్తే.. బీఈ, బీటెక్, బీఎస్సి, పూర్తిచేసి ఉండాలి. ఏడాది పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 28 సంవత్సరాల లోపు ఉండాలి..

అంతేకాదు ఏడాది పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 28 సంవత్సరాల లోపు ఉండాలి.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాతపరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుల ను ఆన్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందు కు సెప్టెంబర్ 09, 2023 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://bel-india.in/ ను సందర్శించగలరు…

Exit mobile version