Beautician Anusha: హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని ఓయో హోటల్లో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న యువతిని నల్లగండ్లలో బ్యూటిషన్ గా పనిచేస్తూ ఉంటున్న అనూషగా గుర్తించారు పోలీసులు.
నల్లగండ్లలో బ్యూటిషన్ గా పనిచేస్తున్న అనూష(26) రాయదుర్గంలోని ఓయో హోటల్లో యువతి ఆత్మహత్య చేసుకుంది. గత కొంతకాలంగా భర్తతో విభేదాల కారణంగా విడిపోయి తల్లిదండ్రుల వద్దనే అనూష జీవనం కొనసాగిస్తోంది. ఈనెల 22న సాయంత్రం ఆరు గంటలకు స్నేహితుల వద్దకు వెళుతున్నానని చెప్పి ఇంట్లో నుండి వెళ్లిన అనూష ఇంటికి తిరిగి రాలేదు. ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఫోన్ చేసిన స్పందించలేదు అనూష.
Read Also:Story Board: మావోయిస్టుల పేరు చెప్పి వందల ఫోన్లు ట్యాప్.. ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ పరువు తీసిందా?
ఆ తర్వాత రాయదుర్గంలోని క్యూబిన్ ఓయో లాడ్జ్ లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది అనూష. ఈ ఘటనను గమనించిన లాడ్జ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అయితే, అనూష ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా పక్కాగా తెలియాల్సి ఉంది. అయితే, అనూష ఆత్మహత్యపై పలు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనితో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు రాయదుర్గం పోలీసులు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
