NTV Telugu Site icon

INDvsAUS Test Series: ఆసీస్‌తో సిరీస్‌కు ముందు టీమిండియాకు ప్రాక్టీస్ సెషన్స్

Rohit

Rohit

భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. స్వదేశంలో ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో మనవాళ్ల డామినేషన్ మరోసారి చూసేందుకు సిద్దంగా ఉన్నారు. కాగా ఫిబ్రవరి 9న నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభమవనుండగా అంతకుముందు భారత జట్టు కోసం ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రెడీ చేసింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌కు ముందు ఇరుజట్లకు ఇది చివరి సిరీస్‌ అవడం వల్ల విజయం కోసం రెండు జట్లు పక్కా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సిరీస్‌ను సాధించి వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలని భారత్‌ గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని భావిస్తోన్న బీసీసీఐ.. టెస్టు సిరీస్‌కు ముందు నాగ్‌పూర్‌లో టీమ్‌ఇండియాకు స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్‌ను నిర్వహించనుంది.

Virat Kohli: లతాజీని కలవకపోవడం బాధగా ఉంది: కోహ్లీ ఇంటర్వ్యూ వైరల్

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లతోపాటు ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ ఫిబ్రవరి 2న నాగ్‌పూర్‌ చేరుకుంటారు. అక్కడ వరుసగా ఐదురోజులపాటు ట్రైనింగ్‌ సెషన్స్‌లో పాల్గొంటారు. అయితే, తొలి టెస్టుకు ఆతిథ్యం ఇచ్చే విదర్భ క్రికెట్ అసోసియేసన్‌ (వీసీఏ) స్టేడియంలో రెండు సెషన్స్‌ మాత్రమే జరుగుతాయి. మిగతా మూడు సెషన్స్‌ని పాత వీసీఏ స్టేడియంలో నిర్వహించనున్నారు. “సిరీస్‌కు ముందు కెప్టెన్‌ రోహిత్ శర్మతోపాటు టెస్టు ఆటగాళ్లు నాగ్‌పూర్‌లో కలుస్తారు. అక్కడ కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ ఆధ్వర్యంలో వారికి క్యాంపు ఉంటుంది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ద్రవిడ్ జట్టుతో కలుస్తాడు. ఇది ఫిట్‌నెస్ క్యాంప్. కానీ, టెస్టు సిరీస్‌ ఆడటానికి ముందు ఎర్ర బంతితో ప్రాక్టీస్ చేయడానికి ఇది మంచి అవకాశంగా ఉపయోగపడుతుంది”అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

Air India Urination Case: కో పాసింజర్‌పై మూత్ర విసర్జన కేసులో శంకర్ మిశ్రాకు బెయిల్