Batchmates Web Series :మళ్ళీ కాలేజ్ రోజుల్లోకి.. ‘బ్యాచ్‌మేట్స్’ సిరీస్ రివ్యూ

Batchmates Web Series

Batchmates Web Series

కాలేజ్ ఫన్, ఫ్రెండ్షిప్, యూత్ ఎమోషన్స్ కలగలిపిన సరికొత్త ఎంటర్‌టైనర్ ‘బ్యాచ్‌మేట్స్’ ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో ప్రేక్షకులను అలరిస్తోంది. కాలేజ్ లైఫ్‌లోకి కొత్తగా అడుగుపెట్టిన నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే ఈ కథ, నేటి యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా రూపొందించబడింది. వైవిధ్యమైన కాలేజ్ నేపథ్యంతో పాటు, లైట్ హార్ట్ టోన్ ఎంగేజింగ్ స్టోరీటెల్లింగ్‌తో ఈ సిరీస్ సాగుతుంది.

ఈ సిరీస్ ప్రధానంగా సిద్, స్యామీ, మిల్కీ, గోల్డీ అనే నలుగురు స్నేహితుల జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది. క్యాంపస్ ఫ్రెండ్షిప్స్, క్రష్‌లు, సరదా సంఘటనలతో వీరి జీవితం ఎంత కలర్‌ఫుల్‌గా సాగుతుందో దర్శకుడు సహజంగా చూపించారు. కొత్త సంబంధాలు, అనుకోని సమస్యల మధ్య స్నేహం విలువను గుర్తు చేస్తూ ఈ కథా గమనం సాగడం విశేషం. ప్రతి ఒక్కరినీ తమ కాలేజ్ రోజులను గుర్తు చేసుకునేలా చేసే ఈ రిలేటబుల్ సిరీస్ ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్లు విడుదల కానున్నాయి. యువతలోని ఉత్సాహాన్ని, చిన్న చిన్న జ్ఞాపకాలను అద్భుతంగా ఆవిష్కరిస్తున్న ఈ ‘బ్యాచ్‌మేట్స్’ను మిస్ అవ్వకండి.