ఇండోర్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. బ్యాంకు ఉద్యోగి భార్యపై ఆర్మీ జవాను అత్యాచారం చేశాడు. నిందితుడు మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమె ప్రైవేట్ పార్ట్‌లో గ్లాస్‌ని చొప్పించాడు. ఆ బాధతో అతి కష్టం మీద పోలీస్ స్టేషన్ కు వచ్చి బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో.. నిందితుడిని అరెస్టు చేశారు.
Read Also: Kolkata rape-murder case: మమతా బెనర్జీని కలవనున్న వైద్యులు, సమ్మె విరమిస్తారా?
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన శుక్రవారం అర్థరాత్రి ఏబీ రోడ్డులోని ఓ హోటల్‌లో జరిగింది. నిందితుడు సంజయ్ యాదవ్ తనను కలవాలని మహిళను ఓ హోటల్‌కు పిలిచాడు. అనంతరం.. మహిళపై అత్యాచారం చేశాడు, అంతటితో ఆగకుండా.. ఆమె ప్రైవేట్ పార్ట్‌లో గ్లాస్‌ని పెట్టాడు. ఈ ఘటనపై బాధితురాలు శనివారం మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు నిందితుడు సంజయ్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Samantha: సమంత.. ఉమెన్ ఆఫ్ ది ఇయర్
బాధిత మహిళ, నిందితులు ఏడాది క్రితం మోవ్ ఆర్మీ క్యాంటీన్‌లో కలుసుకున్నారని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ కౌశల్య చౌహాన్ తెలిపారు. శుక్రవారం నిందితుడు బాధితురాలిని కలిసేందుకు ఇండోర్‌కు వచ్చాడు. వారిద్దరూ ఓ హోటల్‌లో బస చేసి, నిందితుడు ఈ నీచమైన చర్యకు పాల్పడ్డాడు. నిందితుడు మహిళను బ్లాక్ మెయిల్ చేసి కొంత డబ్బు కూడా తీసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం.. బాధిత మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడిగా గుర్తించారు. ప్రస్తుతం అతను అస్సాంలో ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు.