Site icon NTV Telugu

Plain Crash : బంగ్లాదేశ్‌ లో నదిలో కూలిన విమానం.. వైమానిక దళ పైలట్ మృతి

New Project (1)

New Project (1)

Plain Crash : బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్‌లో ఎయిర్‌ఫోర్స్ ట్రైనర్ ఫైటర్ జెట్ నదిలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లలో ఒకరు మరణించారు. ఘటనకు సంబంధించిన వీడియోలో విమానం వెనుక భాగంలో మంటలు కనిపిస్తున్నాయి. నదిలో పడటానికి దాదాపు ఒక రౌండ్ పట్టింది. వీడియోలో జెట్ భాగాలు కూడా కొద్దికొద్దిగా విరిగిపోతున్నట్లు కనిపిస్తాయి. నేవీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 32 ఏళ్ల స్క్వాడ్రన్ లీడర్ అసిమ్ జవాద్ మరణించినట్లు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ (ISPR) తెలిపింది.

Read Also:Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు

బంగ్లాదేశ్ వైమానిక దళం (BAF) YAK130 ట్రైనర్ ఫైటర్ జెట్ ఉదయం 10:25 గంటల ప్రాంతంలో శిక్షణ తర్వాత స్థావరానికి తిరిగి వస్తుండగా అది కూలిపోయింది. ఇందులో వింగ్‌ కమాండర్‌ సోహన్‌ హసన్‌ ఖాన్‌, స్క్వాడ్రన్‌ లీడర్‌ అసిమ్‌ జవాద్‌లు విమానంలో ఉండగా, జెట్‌ నుంచి బయటకు వచ్చేశారు. వీడియోలో పైలట్ పారాచూట్‌తో దిగుతున్నట్లు చూపించారు.

Read Also:CM Revanth Reddy: నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

నదిలో దిగిన ఇద్దరు పైలట్లను ఎయిర్ ఫోర్స్, నేవీ, స్థానిక మత్స్యకారులు రక్షించారు. అసిమ్ జవాద్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పైలట్లు విమానాన్ని విమానాశ్రయానికి సమీపంలో జనసాంద్రత ఉన్న ప్రాంతం నుండి తక్కువ జనాభా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లగలిగారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు BAF ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

Exit mobile version