Site icon NTV Telugu

Bengaluru: నెలకు 6 లక్షలు.. సరిపోతలేవా..

Sam (1)

Sam (1)

బెంగళూరులో లక్షల్లో సంపాదిస్తున్న.. ఖర్చులు కూడా అదే విధంగా ఉంటున్నాయంటున్నది ఓ జంట.. వీరికి నెలకు ఆరు లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చినా కూడా సరిపోవడం లేదంటా..
పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ట్రావెల్ కపుల్ ఆగస్టు నెలలో తమ ఖర్చులకు సంబంధించిన వివరాలతో ఓ వీడియోను ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. తాము అగష్టు నెలలో దాదాపు రూ.5 లక్షల 90వేలు ఖర్చు చేశామని వీడియోలో తెలిపారు. వీళ్ల లెక్కలన్ని విన్న నెటిజన్లు.. మీరు బతకడానికి ఏం చేస్తారు అని కొందరు… ఆరు లక్షలు ఉంటే నెలకు వడ్డీలకు తిప్పుకుంటామని మరి కొందరు.. వారికి నచ్చిన స్టైల్లో కామెంట్స్ పెడుతున్నారు.

అగస్టు నెలలో ఇంటి అద్దె కోసం 42వేలు, జిమ్ కోసం 40వేలు, సామాన్లకు 40వేలు.. హోటల్ బుకింగ్స్ కోసం 3లక్షలు ఖర్చు పెట్టామని చెప్పారు. మిగిలిన ఖర్చులు పెట్టుకున్నామని వెల్లడించారు. నెలకు ఆరు లక్షల ఆదాయం కూడా సరిపోకపోతే.. నెలకు 15వేలు కూడా సంపాదించని వారి పరిస్థితి ఏంటని.. కొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Banglore couples

Exit mobile version