నందమూరి నటసింహం బాలయ్య..గత ఏడాది వచ్చిన భగవంత్ కేసరి సినిమాతో హాట్రిక్ హిట్ అందుకున్నాడు.. బాలయ్య ప్రతి సినిమాలో తనదైన మాస్ అండ్ యాక్షన్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు..తాజాగా బాలయ్య దర్శకుడు బాబీ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య ఈసినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక బాలయ్య తన నెక్ట్స మూవీస్ కు సబంధించి త్వరలో అప్ డేట్ ఇవ్వన్నారు.. ఈక్రమంలో బాలయ్య కు సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో మంచి జోరు మీద ఉన్న బాలకృష్ణ.. నెక్ట్స్ రెండు నెలలు షూటింగ్స్ కు లాంగ్ బ్రేక్ ఇవ్వాలి అనుకుంటున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుండడంతో ప్రస్తుతం బాలయ్య ఫోకస్ అంతా పాలిటిక్స్ మీదనే ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే బాలయ్య హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక అక్కడి నుంచే మరోసారి పోటీ చేస్తుండటంతో ఎలక్షన్ ప్రచార కార్యక్రమాలలో జోరుగా పాల్గొననున్నారు. దీనితో ఆయన షూటింగ్స్ కు బ్రేక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే మేకర్స్ ఇబ్బంది పడకుండా.. బాలయ్య లేని సన్నివేశాలు చిత్రీకరించాలని దర్శకుడు ప్లాన్ చేశారట.బాలయ్య బాబీ కాంబో మూవీ బడ్జెట్ కూడా అంతకంతకూ పెరుగుతోందని సమాచారం. ఇక బాలయ్య వరుస విజయాలు సాధించిన నేపథ్యంలో సితార నిర్మాతలు ఈ సినిమా బడ్జెట్ విషయంలో రాజీ పడడం లేదని సమాచారం. పక్కా మాస్ అండ్ యాక్షన్ మూవీ గా బాబీ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. బాలయ్యను ఈ సారి బాబీ మరింత కొత్త చూపించబోతున్నట్లు తెలుస్తుంది.