Site icon NTV Telugu

Balayya : విజ్జి పాప టాలీవుడ్ కి దొరికిన అదృష్టం..

Whatsapp Image 2023 10 24 At 11.06.34 Am

Whatsapp Image 2023 10 24 At 11.06.34 Am

నటసింహం బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి..యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న గ్రాండ్ గా విడుదల అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. దీనితో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. భగవంత్ కేసరి సక్సెస్ మీట్ ను ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు బాలకృష్ణ, శ్రీలీల, అనిల్ రావిపూడి మరియు థమన్ తో పాటు చిత్ర నిర్మాతలు, సాంకేతిక నిపుణులు కూడా హాజరయ్యారు.వేదికపై బాలకృష్ణ సుదీర్ఘంగా మాట్లాడాడు. ప్రేక్షకులకు, చిత్ర యూనిట్ కి బాలయ్య దసరా శుభాకాంక్షలు చెప్పారు…. స్త్రీ సాధికారిత గురించి తెరకెక్కిన తన చిత్రం దసరా నవరాత్రి రోజుల్లో విడుదల కావడం గొప్ప అదృష్టం అని అన్నారు. సినిమాకు ప్రేక్షకుల నుండి వస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపాడు. చిత్ర యూనిట్ పై ఆయన ప్రశంసలు కురిపించారు బాలయ్య . దర్శకుడు అనిల్ రావిపూడి విభన్నమైన కథలు తెరకెక్కిస్తున్నారు. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది..

అలాగే సంగీతం అందించిన థమన్ పై బాలయ్య ఆసక్తికర కామెంట్స్ చేశాడు. థమన్ సూపర్ ఫిగర్. మా కాంబినేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. థమన్ దెబ్బకు ఊపర్స్ కూడా బద్దలైపోతున్నాయి అన్నారు బాలయ్య. అలాగే హీరోయిన్ కాజల్ గురించి మాట్లాడుతూ చందమామ కాజల్ గుండ్రని చేప కళ్ళతో యూత్ ని చాలా కాలం ఆకట్టుకుంది.. పెళ్లి చేసుకొని చిన్న గ్యాప్ తీసుకుంది. మా చిత్రంతో సత్యభామలా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. ఆమె నటన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అని అన్నారు. అలాగే అర్జున్ రామ్ పాల్ ని గురించి చెబుతూ, ముంబై నుండి నా దోస్త్ వచ్చాడని బాలయ్య హిందీలో మాట్లాడారు.ఆయన నేషనల్ అవార్డు విన్నర్. ఈ చిత్రానికి సొంతగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నాడని బాలయ్య అన్నారు. ఇక విజ్జి పాప శ్రీలీల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు బాలయ్య.చిలిపితనం అలాగే అద్భుతమైన పెర్ఫార్మన్స్ అలరిస్తున్న శ్రీలీల విజ్జి పాప వంటి రోల్ చేయడం చేయడం గొప్ప విషయం.సినిమాలో శ్రీలీల అద్భుతంగా నటించింది. శ్రీలీల టాలీవుడ్ కి దొరికిన అదృష్టం అని చెప్పుకొచ్చారు బాలయ్య..

Exit mobile version