NTV Telugu Site icon

Gangs Of Godavari : విశ్వక్ సేన్ మూవీ చూసిన బాలయ్య .. అదిరిపోయిందంటూ ప్రశంసలు..

Balayya

Balayya

Gangs Of Godavari : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను ఛల్ మోహన్ రంగ మూవీ ఫేమ్ కృష్ణ చైతన్య తెరకెక్కించారు.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది..ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ,సాంగ్స్ ,ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Read Also :Mehreen : బీచ్ లో బికినీతో రెచ్చిపోయిన మెహ్రీన్.. పిక్స్ వైరల్..

ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు.ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా నందమూరి నటసింహం బాలకృష్ణ గెస్ట్ గా వచ్చారు.విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మంచి విజయం సాధించాలని బాలయ్య విశ్వక్ కు బెస్ట్ విషెస్ తెలియజేసారు.నేడు(మే 31 )న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది.ఈ సినిమా కథ పాతది అయినా దర్శకుడు తన టేకింగ్ తో అదరగొట్టాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాను ప్రసాద్ ల్యాబ్స్ లో బాలయ్య ఫ్యామిలీతో కలిసి వీక్షించారు.సినిమా చాలా బాగుంది అంటూ చిత్ర దర్శకుడిని,అలాగే సినిమాలోని నటినటులందరిని ప్రశంసించారు.ముఖ్యంగా విశ్వక్ యాక్టింగ్ ను బాలయ్య ఎంతగానో మెచ్చుకున్నారు .

Show comments