Site icon NTV Telugu

Bajaj Platina 110 NXT: కేవలం రూ. 74,214కే 70 కి.మీ. మైలేజ్, OBD-2B అనుకూల ఇంజిన్‌తో ప్లాటినా 110 NXT లాంచ్..!

Bajaj Platina 110 Nxt

Bajaj Platina 110 Nxt

Bajaj Platina 110 NXT: భారతదేశంలో బజాజ్ కంపెనీ 2025 మోడల్ ప్లాటినా NXT 110 కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ బైక్ కొన్ని కొత్త కాస్మెటిక్ మార్పులు, OBD-2B నిబంధనలకు అనుగుణంగా ఉండే ఇంజిన్‌తో ప్రవేశపెట్టబడింది. దీని ఫలితంగా ఈ మోడల్ ధర స్వల్పంగా పెరిగింది. మరి ఈ కొత్త బైక్ ఫీచర్ల గురించి తెలుసుకుందామా..

Read Also: Boycott Turkey: భారత్పై పాక్ దాడులకు టర్కీ సహాయం.. తుర్కియే ఉత్పత్తుల బహిష్కరణ

ఇంజిన్, పవర్‌ట్రెయిన్:
2025 ప్లాటినా NXT 110 మునుపటి మోడల్ మాదిరిగానే 115.45cc ఇంజిన్‌ను కలిగి ఉంది. కానీ, ఇప్పుడు ఇది OBD-2B నిబంధనలకు అనుగుణంగా ఉంది. ఇది 8.5 hp పవర్, 9.81 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రానిక్ కార్బ్యురేటర్‌కు బదులుగా ఇప్పుడు ఇంధన ఇంజెక్షన్ యూనిట్ అందించబడింది.

హార్డ్‌వేర్, డిజైన్:
ఈ బైక్ ప్రాథమిక నిర్మాణం కిందటి మోడల్‌ను పోలి ఉంటుంది. అయితే, ఇప్పుడు హెడ్‌లైట్‌లకు క్రోమ్ బెజెల్స్, LED DRL లు ఉన్నాయి. ఈ బైక్ ఎరుపు-నలుపు, సిల్వర్-నలుపు, పసుపు-నలుపు రంగుల ఎంపికలలో లభిస్తుంది. కొత్త గ్రాఫిక్స్, ఇంధన ట్యాంక్ డిజైన్‌తో ఇది భిన్నంగా కనిపిస్తుంది. అంతేకాకుండా, డిజిటల్ కన్సోల్‌లో USB ఛార్జింగ్ పోర్ట్ చేర్చబడింది. ఈ బైక్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, సస్పెన్షన్ కోసం వెనుక భాగంలో గ్యాస్-చార్జ్డ్, ప్రీలోడ్-అడ్జస్టబుల్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉంది. అయితే కొత్త ఫీచర్లు, కాస్మెటిక్ మార్పులు, ఇంకా OBD-2B అనుకూల ఇంజిన్ కారణంగా ధరలో స్వల్ప పెరుగుదల కనిపించింది . 2025 బజాజ్ ప్లాటినా NXT 110 రూ. 74,214 ధరగా నిర్ణయించారు.

Read Also: NVSS Prabhakar: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డీల్.. రేవంత్ స్థానంలో కేసీఆరే సీఎం..!

ప్లాటినా NXT 110 స్పెసిఫికేషన్స్:
ఇంజిన్: 115.45 సిసి, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో కూడిన ఎయిర్-కూల్డ్ ఇంజిన్.
ట్రాన్స్మిషన్: మాన్యువల్.
బ్రేకులు: కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS)తో ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు.
వీల్స్, సస్పెన్షన్: 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ ఇంకా వెనుక భాగంలో గ్యాస్-చార్జ్డ్, ప్రీలోడ్-అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్.
మైలేజ్: లీటరుకు 70 కి.మీ.
ఇంధన ట్యాంక్ సామర్థ్యం: 11 లీటర్లు.
ఇతర ఫీచర్స్: USB ఛార్జింగ్ పోర్ట్, హాలోజన్ హెడ్‌లైట్లు, డిజిటల్ ఇన్‌సెట్‌తో అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్.
బరువు: 119 కిలోలు.
ధర: రూ. 74,214 (ఎక్స్-షోరూమ్).

Exit mobile version