NTV Telugu Site icon

Ayesha Takia : సినిమాలు చేసే ఆసక్తి లేదు..నన్ను వదిలేయండి..

Whatsapp Image 2024 02 20 At 12.14.05 Am

Whatsapp Image 2024 02 20 At 12.14.05 Am

బాలీవుడ్ బ్యూటీ ఆయేషా టాకియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామ తెలుగులో నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘సూపర్ ‘మూవీలో నటించి మెప్పించింది. అయితే ఈ భామ ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమకు, పబ్లిసిటీకి దూరంగా ఉంటుంది.ఇటీవల ముంబాయ్ ఎయిర్ పోర్ట్ లో ఫోటోగ్రాఫర్స్ కి కనిపించింది.. వారు తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా తన లుక్స్ పై ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఆయేషా ఆ ట్రోల్స్ కి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది.సినిమాల నుండి దూరమయిన తర్వాత హీరోయిన్స్ లుక్స్ చాలావరకు మారిపోతుంటాయి. ఆయేషా కూడా అలాగే మారింది. దీంతో తనపై ట్రోల్స్ మొదలయ్యాయి. వాటన్నింటిని చూస్తూ ఈ భామ సైలెంట్ గా ఉండాలని అనుకోలేదు. అందుకే ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసి వారందరికీ ఘాటుగా రిప్లై ఇచ్చింది.

‘ఇది మీకు చెప్పాల్సిందే. రెండు రోజుల క్రితం ఫ్యామిలీలో ఒక మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అర్జెంటుగా గోవా వెళ్లాల్సి వచ్చింది. వీటన్నింటి మధ్యలో ఫ్లైట్ ఇంకాసేపటికీ ఉంది అన్నప్పుడే ఫ్యాన్స్ నన్ను ఆపి పోజులు ఇవ్వమని అడిగారు’ అంటూ అసలు తను ఎయిర్పోర్టుకు ఎందుకు రావాల్సివచ్చిందో ముందుగా చెప్పుకొచ్చింది.‘దేశంలో నా లుక్స్ గురించి చర్చించుకోవడం కంటే వేరే ముఖ్యమైన పనులు ఏం లేనట్టు నాకు అనిపిస్తోంది. నా లుక్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని ఇతరుల అభిప్రాయాలు తెగ వైరల్ అవ్వడం చూస్తున్నాను. నన్ను వదిలేయండి. అందరూ చెప్తున్నట్టుగా నాకు సినిమాలు చేయడంలో, కమ్ బ్యాక్ ఇవ్వడంలో ఏ మాత్రం ఆసక్తి లేదు. నేను నా జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నాను. నాకు ఏ ఫేమ్ అవసరం లేదు. ఏ సినిమా అవసరం లేదు. కాబట్టి చిల్ అవ్వండి. నా గురించి అస్సలు పట్టించుకోకుండా ఉండడానికి మీకు హక్కు ఉంది’ అంటూ ఇక సినిమాలపై తనకు అస్సలు ఆసక్తి లేదనే విషయాన్ని ఆయేషా టాకియా బయటపెట్టింది.