నిన్న జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎన్నికల సంఘానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నేడు రిపోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగిన తీరు రాష్ట్ర ప్రజలందరూ చూశారు.. ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ స్లిప్ లు తీసుకుని వాళ్లే ఓట్లు వేశారు..
Also Read:Suresh Raina: టీమిండియా మాజీ క్రికెటర్ కు ఈడీ షాక్.. నేడే విచారణ
రెండు బూత్ లలో మాత్రమే రీపోలింగ్ జరుపుతున్నారు.. కానీ మేము అన్ని కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని కోరాం.. 15 కు 15 బూత్ లలో మొత్తం దొంగ ఓట్లు పడ్డాయి.. ఈ రీపోలింగ్ కంటితుడుపు చర్య.. కేంద్ర బలగాలతో రీపోలింగ్ జరపాలి.. ఈ రీపోలింగ్ ని బహిష్కరిస్తున్నాము.. ప్రజాస్వామ్యాన్ని అబాసుపాలు చేశారు.. వైసీపీ కోర్టు కు పోతున్నామని కంటితుడుపు చర్యలు చేపట్టారు.. పులివెందులలో కొత్త సంస్కృతికి చంద్రబాబు నాంది పలికారు.. రిపోల్ ఓ డ్రామా అని హాట్ కామెంట్స్ చేశారు.
