ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులోనూ ఫుడ్ కు సంబందించిన వీడియోల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రకరకాల కాంబినేషన్స్ తో అదిరిపోయే వంటలను తయారు చేస్తున్నారు.. కొన్ని రుచులు జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం తీవ్రంగా కోపాన్ని తెప్పిస్తున్నాయి.. తాజాగా ఓ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి అవకాడో తో అద్భుతమైన వంటను చేశాడు.. దాన్ని తింటూ కొందరు సూపర్ అని కామెంట్స్ చేస్తున్నారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
గత కొన్నేండ్లుగా బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఛాయిస్‌గా పలువురు అవకాడోను ఎంచుకుంటున్నారు.. అది రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. అవకాడోతో చేసిన రెసిపీలను ఇష్టంగా తినేందుకు పలువురు మొగ్గుచూపుతున్నారు. అవకాడోల్లో ఆరోగ్యకర కొవ్వులు గుండెకు మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగించడంతో పాటు జీర్ణశక్తి మెరుగయ్యేందుకు ఉపకరిస్తుంది.. దాంతో బరువును తగ్గాలని అనుకొనేవారు వీటిని మీ డైట్ లో చేర్చుకోవడం మంచిది..
అవకాడో తరచూ తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఇక రెస్టారెంట్లు సైతం తమ మెనూల్లో అవకాడో డిష్‌లను చేర్చాయి. స్ట్రీట్ ఫుడ్ వెండార్లు సైతం అవకాడో టోస్ట్‌ను విక్రయిస్తున్నారు.. వడోదరకు చెందిన ఫుడ్ బ్లాగర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఎంతో శుచిగా, రుచిగా అవకాడో టోస్ట్‌ను స్ట్రీట్ ఫుడ్ విక్రేత రెడీ చేస్తుండటం పలువురిని ఆకట్టుకుంది. గ్లోవ్స్ ధరించి కుక్ ఎన్నో ప్రికాషన్స్, ప్రిపరేషన్‌తో ఫుడ్‌ను సిద్ధం చేయడం నెటిజన్లను ఆకట్టుకుంది.. అలా ఇది నెట్టింట ట్రెండ్ అవుతుంది.. ఆ వీడియో పై ఓ లుక్ వేసుకోండి..