తిరుమల శ్రీవారి మెట్టు వద్ద ఆటోవాలలతో భక్తులకు తిప్పలు తప్పడం లేదు. శ్రీవారి మెట్టు మార్గం శని, ఆది వారాలలో భక్తులతో కిక్కిరిసిన పోతోంది. దీనిని ఆసరాగా చేసుకుని.. టైమ్ స్లాట్ టిక్కెట్లు తీసి ఇస్తామని తిరుపతి నుంచి శ్రీవారి మెట్టుకు భక్తులను ఆటోవాలలతో తరలిస్తున్నారు. ఒక్కో ఆటో డ్రైవర్ 5 లేక 7 మంది భక్తుల బృందం నుంచి ఐదు వేలకు పైగా వసూల్ చేస్తున్నారు. దీంతో శ్రీవారిమెట్టు మార్గం వద్దకు శ్రీవారి భక్తులు భారీగా చేరుకుంటున్నారు.
మరోవైపు కార్లు, బస్సులలో కూడా శ్రీవారి భక్తులను కొందరు కేటుగాళ్లు తరలివస్తున్నారు. ఆటోలు మాత్రమే పంపుతున్నారని టీటీడీ సెక్యూరిటీతో భక్తులు వాగ్వాదం పెట్టుకుంటున్నారు. పంపుహౌస్ వద్ద ఉన్న భారీగేడ్లు, సెక్యూరిటీని తోసుకుని భక్తులు వెళ్తున్నారు. ఆటోవాలల దందాతో శని, ఆది వారాలలో శ్రీవారి మెట్టు వద్ద భక్తులు భారీగా ఉంటున్నారు.