NTV Telugu Site icon

Austrian airlines: గగనతలంలో భారీ వడగండ్లు.. దెబ్బతిన్న విమానం ముక్కు

Flite

Flite

గగనతలంలో ఉండగా ఓ విమానం తీవ్ర ఒడుదుడుకులకు గురైంది. తీవ్రమైన వడగండ్ల వాన కురవడంతో విమానం కుదుపులకు గురైంది. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. వడగండ్లు పడడంతో పెద్ద శబ్ధాలు రావడంతో ప్యాసింజర్స్ అంతా వణికిపోయారు. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాక హడలెత్తిపోయారు. ఈ ఘటన ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఆదివారం చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Balakrishna: బాలయ్య బర్త్ డే.. ఏపీలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ ప్రారంభం!

ఫ్లైట్ OS434 స్పెయిన్‌లోని పాల్మా డి మల్లోర్కా నుంచి ఆస్ట్రియాలోని వియన్నాకి ప్రయాణిస్తోంది. ఇంతలో హఠాత్తుగా పెద్దగా వడగండ్ల వాన కురవడం ప్రారంభమైంది. అంతేకాకుండా తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షం కురిసింది. కాక్‌పిట్ కిటికీలు, బాహ్య కవర్లు, విమానం ముక్కు పూర్తిగా దెబ్బతింది. ల్యాండింగ్‌కి 20 నిమిషాల ముందు తీవ్రమైన వడగళ్లు, ఉరుములతో కూడిన ప్రమాదాన్ని ఎదుర్కొన్నట్లు ప్రయాణికుడు ఓక్లీ తెలిపాడు. ఉన్నట్టుండి అల్లకల్లోలం ప్రారంభమైందని.. దీంతో ప్రయాణికులంతా హడలెత్తిపోయారని చెప్పాడు. దాదాపు రెండు నిమిషాల పాటు వడగళ్లు పడినట్లు పేర్కొన్నాడు. విమాన సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారని చెప్పాడు. తీవ్రమైన వడగళ్ల వర్షం ఉన్నప్పటికీ విమానం వియన్నా-ష్వెచాట్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయిందని ప్రయాణికుడు పేర్కొన్నాడు. ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ మీడియాకు తెలిపింది.

ఇది కూడా చదవండి: Kesineni Nani: తమ్ముడి గెలుపు.. అన్న ముగింపు..! చర్చగా మారిన కేశినేని వ్యవహారం..