Site icon NTV Telugu

Australian Currency : కరెన్సీ నోట్లపై ఆమె ఫోటో తొలగించిన ప్రభుత్వం

Aus Doller

Aus Doller

Australian Currency : ఆస్ట్రేలియా క్రమక్రమంగా బ్రిటీష్ పాలన తాలుకా గుర్తులను చెరిపేసుకుంటోంది. ఈ క్రమంలోనే కరెన్సీ నోట్లపై దివంగత క్వీన్‌ ఎలిజబెత్‌-2 ఫొటోను తొలగించి కొత్తవి ముద్రించాలని ఆస్ట్రేలియా గవర్నమెంట్ నిర్ణయించింది. ముందుగా 5 ఆస్ట్రేలియా డాలర్ల కరెన్సీ నోటుపై ఆమె ఫొటోను తొలగించి, ఆ స్థానంలో స్వదేశీ సంస్కృతి, చరిత్ర ప్రతిబింబించేలా, గౌరవించేలా కొత్త డిజైన్‌ రూపొందించనున్నది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా సెంట్రల్‌ బ్యాంక్‌ గురువారం వెల్లడించింది. రాణి ఎలిజబెత్‌ అస్తమయం తర్వాత రాజుగా పగ్గాలు చేపట్టిన కింగ్‌ ఛార్లెస్‌ ముఖచిత్రాన్ని 5 డాలర్ల కరెన్సీ నోటుపై ముద్రించాలని భావించట్లేదని ఆస్ట్రేలియా కేంద్ర బ్యాంక్‌ తాజాగా ప్రకటించింది.

Read Also: Petrol Rate: రాష్ట్ర బడ్జెట్‌లో సామాన్యులకు షాక్.. పెట్రోల్ ధర రూ.2 పెంపు

అయితే, ఛార్లెస్‌ ఫొటో ఉండే కొత్త నాణేలను మాత్రం ఈ ఏడాది చివరిలోపు చలామణిలోకి తీసుకురానున్నారు. ఈ మార్పుపై ప్రభుత్వంతో చర్చించాకే ఈ తుది నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర బ్యాంక్‌ వెల్లడించింది. ప్రస్తుతం 5 డాలర్ల నోటుపై ఒక వైపు ఎలిజబెత్‌ రాణి-2 ఫొటో, మరోవైపు ఆస్ట్రేలియా పార్లమెంట్‌ భవనం ఫొటో ఉంటుంది. ఎలిజబెత్‌ ఫొటోను మాత్రమే తొలగిస్తామని ఆస్ట్రేలియా పేర్కొన్నది. కొత్త నోటు రూపకల్పనలో స్వదేశీ సమూహాలను సంప్రదిస్తామని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. కొత్త నోటు వచ్చే వరకు ప్రస్తుత నోటు చెలామణిలో ఉంటుందని పేర్కొన్నది.

Read Also:Bathroom Thief: దొంగతనానికి వచ్చాడు.. ఆపుకోలేక ఎంజాయ్ చేశాడు

Exit mobile version