NTV Telugu Site icon

Rohit Sharma: రోహిత్‌కు అందుకే సరైన గుర్తింపు దక్కలేదు: ఆసీస్ మాజీ క్రికెటర్

2

2

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత శతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ కఠినపిచ్‌పై పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్.. రోహిత్ ఆటతీరుపై ప్రంశసల వర్షం కురిపించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగడం రోహిత్‌ టెస్టు కెరీర్‌ను కాపాడిందని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా ప్రమోషన్‌ పొందడం కూడా సుదీర్ఘ ఫార్మాట్‌లో రోహిత్‌ తిరిగి పుంజుకోవడంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నాడు. బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టులో రోహిత్‌ శర్మ శతకం (120) బాదాడు. ఆసీస్‌ బ్యాటర్లు పరుగులు చేయడానికి అష్టకష్టాలు పడ్డ పిచ్‌పై హిట్‌మ్యాన్ ఓపికగా ఆడి సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది.

Also Read: Shubman Gill: టీమిండియా యంగ్‌ ప్లేయర్ గిల్‌కు ఐసీసీ అవార్డు

“టెస్టు క్రికెట్‌లో ఓపెనర్‌గా వెళ్లడం రోహిత్‌ శర్మ కెరీర్‌ని కాపాడింది. మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసి తన అపారమైన నైపుణ్యాన్ని వృథా చేసుకునేలా కనిపించాడు. కానీ, ఓపెనర్‌గా ఆడి మెరుగయ్యాడు. అప్పుడు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీకి ఉన్న పాపులారిటీ వల్ల రోహిత్‌కు తగినంత గుర్తింపు దక్కలేదు. రోహిత్ తిరిగి పుంజుకోవడంలో కెప్టెన్సీ కూడా ప్రధాన పాత్ర పోషించింది. జట్టును నడిపించడానికి అవసరమైన క్రమశిక్షణ రోహిత్‌ ఆటతీరును మరో స్థాయికి తీసుకెళ్లింది. నాగ్‌పూర్‌ టెస్టులో పిచ్‌ను అర్థం చేసుకుని అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇరు జట్ల ఆటగాళ్లకు భారత పిచ్‌లపై ఎలా ఆడాలో చూపించాడు. రవీంద్ర జడేజా కొద్దిమేరకు అతడి తరహాలో ఆడాడు” అని ఇయాన్‌ చాపెల్ వివరించాడు.

Also Read: Supreme Hero: ప్రేమలో పడమంటే… మత్తులో పడ్డావా రాజా?