చిత్తూరు జిల్లాలోని పలమనేరులో నకిలీ వజ్రాలతో ఘరానా మోసానికి ప్రయత్నం చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి 12 నకిలీ వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, వజ్రాలుగా చెప్పి రంగురాళ్లతో పలమనేరు మండలం ఎం.కోటూరు గ్రామానికి చెందిన కన్నయ్య గౌడ్ ను మోసం చేసేందుకు చంద్రకుమార్ అలియాస్ డేవిడ్, శ్రీనివాసులు అనే వ్యక్తులు ప్రయత్నించారు.
Read Also: Sreeleela: వరుస ఆఫర్లు .. ఓవర్ నైటే మైండ్ బ్లాకయ్యే డెసిషన్
ఆ వజ్రాలు 20 లక్షల రూపాయల ఖరీదైనవి అంటూ 12 నకిలీ వజ్రాలను కేవలం 10 లక్షల రూపాయలకే విక్రయిస్తామని కన్నయ్య గౌడ్ ను చంద్రకుమార్, శ్రీనివాసులు నమ్మించారు. కావాలంటే వీటి నాణ్యత పరిశీలించుకుని రావాలని ఆ 12 నకిలీ వజ్రాలను కన్నయ్య గౌడ్ కు చంద్రకుమార్, శ్రీనివాసులు ఇచ్చారు. అదే సమయంలో కన్నయ్య గౌడ్ దగ్గర నుంచి నకిలీ వజ్రాలను దారి కాచి మరో వ్యక్తి కొట్టేశాడు. దీంతో కన్నయ్య గౌడ్ ను నిందితులు చంద్రకుమార్, శ్రీనివాసులు తమ వజ్రాలు తమకు ఇవ్వాలి.. లేకపోతే రూ. 10 లక్షలైన ఇవ్వాలని డిమాండ్ చేశారు
Read Also: Kottu Satyanarayana: చంద్రబాబుపై సంచలన ఆరోపణలు.. పవన్‌పై పథకం ప్రకారం కుట్ర..!
ఇక, నిందితుల బెదిరింపులను భరించలేక బాధితుడు కన్నయ్య గౌడ్ చివరకు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అంతా పథకం ప్రకారమే కన్నయ్య గౌడ్ ను ట్రాఫ్ చేసినట్లు చేసేందుకు ప్రయత్నించారని గుర్తించారు. దీంతో నిందితులు చంద్రకుమార్, శ్రీనివాసులను అరెస్ట్ చేసి పలమనేరు పోలీసులు వారి దగ్గర ఉన్న వజ్రాలుగా చెప్పే 12 రంగు రాళ్లును స్వాధీనం చేసుకున్నారు.