Bairi Naresh: హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు భైరి నరేష్ పై మరోసారి దాడి జరిగింది. హనుమకొండ జిల్లా గోపాల్ పూర్ లో భైరి నరేష్ పై అయ్యప్ప భక్తులు దాడి చేశారు. పోలీస్ వెహికిల్ లో ప్రొటెక్షన్ తో వెళ్తున్న నరేష్ ని కిందకు లాగి దాడి చేశారు. గతంలో అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి భైరి నరేష్ జైలుకెళ్లాడు. జైలు నుంచి బయటకు వచ్చాక మరోసారి వివాస్పద వాఖ్యలు చేశాడు.
Read Also: KTR: కిషన్ రెడ్డికి మెదడు మోకాళ్లలో ఉందా? అరికాళ్లలో ఉందా?: కేటీఆర్
జైలుకు వెళ్లి వచ్చినా తీరు మార్చుకోకుండా వ్యాఖ్యలు చేస్తుండడంతో అయ్యప్ప భక్తులు దాడి చేశారు. దాడి అనంతరం భైరి నరేష్ మాట్లాడుతూ.. నాపై దాడి చేస్తారనే పోలీసులను రక్షణ కోరానన్నారు. పోలీసుల వాహనంలో ఉండగానే నాపై దాడి చేశారన్నారు. ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలని కోరారు. నాకు గన్ లైసెన్స్ కావాలని భైరి నరేష్ కోరారు.
