Site icon NTV Telugu

Atrocity: ESI ఆసుప్రతిలో దారుణం.. లిఫ్ట్ లో యువతిని బంధించి అత్యాచారం

Esi Hospatel

Esi Hospatel

Atrocious: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూలన అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరినీ వదిలిపెట్టడం లేదు కామాంధులు. పది రోజుల పాప దగ్గర నుంచి పండు ముసలి దాకా ఆడదైతే చాలు అన్నట్లుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు. ఆడదానికి ఒక తల్లిగా, తోబుట్టువుగా చూసే రోజుల పోయాయి. ఆడదిని ఆట వస్తువుగా చూస్తున్నారు. ఆమె ఎప్పుడు ఒంటరిగా దొరికితే చాలు అనుభవించేందుకు సిద్దంగా ఉన్నారు. నెలల పశిపాప నుంచి వృద్ధుల వరకు అత్యాచారానికి బలవుతున్నారు. పగలు రాత్రి అనే తేడాలేకుండా ఆడదానిపై కర్కసంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ సనత్ నగర్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో జరిగింది. ఆసుపత్రి లిఫ్ట్‌లోని భవనం పై అంతస్తుకు బాలికను తీసుకెళ్లాడు. అనంతరం లిఫ్ట్ ఆపరేటర్ యువతి నోటికి గుడ్డ పెట్టి అత్యాచారం చేశాడు. డైట్‌ సెక్షన్‌లోని ఫ్లోర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Read also: Parliament: రేపటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబం వైద్యం కోసం ESI ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యింది. వారం రోజుల నుండి యువతి అన్నయ్య ESI ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. యువతీ ఆసుపత్రిలోనే ఉండి అన్నయ్య బాగోగులు చూసుకుంటుంది. అయితే ఆ యువతి పై లిఫ్ట్‌ ఆపరేటర్‌ కన్ను పడింది. ఆ యువతి లిప్ట్ ఎక్కినప్పుడల్లా మాటలను కలిపాడు. వారిద్దరే ఉన్నట్లు ఆ యువతి చెప్పడంతో వీరిద్దరు తప్పా ఎవరు లేరని భావించాడు. సమయం కోసం వైట్ చేశాడు. చివరకు ఆ సమయం రానే వచ్చింది. ఆ యువతి లిప్ట్ ఎక్కి అన్నదర్గకు వెళుతుండగా లిఫ్ట్‌ ఆపరేటర్‌ ఆ యువతితో మాటలు కలిపాడు. మాటలు కాస్త కామంతో రావడంతో ఆయువతి లిప్ట్ ను స్టాప్ చేయాలని కోరింది. లేదంటే గట్టిగా అరుస్తానంటూ చెప్పడంతో లిఫ్ట్‌ ఆపరేటర్‌ ప్లాన్ ప్రకారం తన వద్ద వున్న బట్టను ఆమె నోట్లో కుక్కాడు. అరవకూడదని లేదంటే చంపేస్తానని బెదిరించాడు. లిప్ట్ ను పై ఫ్లోర్ కి తీసుకుని వెళ్లాడు. ఆ యువతిని డైట్‌ సెక్షన్‌లోని ఫ్లోర్‌లో తీసుకునివెళ్లి ఆమె పై అత్యాచారం చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న యువతి ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికపై అత్యాచారం జరిగినట్లు ఈఎస్‌ఐ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు.
Astrology: సెప్టెంబర్‌ 17, ఆదివారం దినఫలాలు

Exit mobile version