Site icon NTV Telugu

Athreyapuram Brothers : ఆసక్తి రేకెత్తిస్తున్న ఆత్రేయపురం బ్రదర్స్ కాన్సెప్ట్ పోస్టర్

Athyreapuram

Athyreapuram

ఆత్రేయపురం బ్రదర్స్ అనే సినిమా రూపొందిస్తున్నారు డైరెక్టర్ రాజేష్ జగన్నాధం. S2S సినిమాస్, ది ఫెర్వేంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్లపై VSK సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్, ప్రవీణ్ గద్దె, రాజేష్ గద్దె, రాకేష్ గద్దె నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజీవ్ కనకాల, గవిరెడ్డి, సన్నీ పత్సా, రఘు బాబు, గీత్ సాయిని, నేహా పఠాన్, సిద్దార్థ్ గొల్లపూడి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ వశిష్ట, డైరెక్టర్ అనుదీప్, డైరెక్టర్ ఆదిత్య హాసన్, డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి వశిష్ట క్లాప్ కొట్టగా.. విజయ్ కనకమేడల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రవీణ్ కాండ్రేగుల, ఆదిత్య హాసన్ స్క్రిప్ట్ అందించారు. మరో డైరెక్టర్ అనుదీప్ మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా వదిలిన కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఏ స్వీట్ రైవల్రీ అనే ట్యాగ్ లైన్ తో ఇద్దరు వ్యక్తులు బల పరీక్ష చేసుకుంటున్నట్లుగా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ఇది చూస్తూనే ఈ సినిమా కథలో వైవిద్యం ఉంటుందని, గత సినిమాల్లో కెల్లా ఈ సినిమా భిన్నంగా ఉండబోతుందని అర్థమవుతోంది. ఈ మూవీకి డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ రమీజ్ నవనీత్, మ్యూజిక్ డైరెక్టర్ సంతు ఓంకార్, ఎడిటర్ అనిల్ పసల, సౌంగ్ సింక్ సినిమా. అతిత్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.

Exit mobile version