NTV Telugu Site icon

America Shooting: అమెరికాలోని రెండు నగరాల్లో కాల్పులు.. ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు

Us

Us

America Shooting: అమెరికాలో రోజురోజుకూ కాల్పుల ఘటనలు పెరిగిపోతున్నాయి. ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో కనీసం ముగ్గురు మరణించగా, మొత్తం 20 మంది గాయపడ్డారు. మొదటి సంఘటన మేరీల్యాండ్‌లోని అన్నాపోలిస్‌లోని ఒక ఇంటి లోపల జరిగింది. అక్కడ సామూహిక కాల్పుల ఘటనలో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించారు.. ఏడుగురు గాయపడ్డారు. US రాజధాని వాషింగ్టన్ DC నుండి అన్నాపోలిస్ నగరం దాదాపు 48 కిలోమీటర్లు ఉంటుంది.

రెండవ సంఘటన న్యూయార్క్‌లోని సిరాక్యూస్ నగరంలో జరిగింది. ఇక్కడ కనీసం 13 మంది కత్తిపోట్లు, కాల్పుల్లో గాయపడినట్లు చెబుతున్నారు. ఆదివారం, జూన్ 11న వందలాది మంది ప్రజలు సిరక్యూస్‌లోని ఒక వీధిలో గుమిగూడారు. అప్పుడు ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో జనం అటు ఇటు పరుగులు తీశారు. గుంపులో ఉన్న చాలా మంది వ్యక్తులపై కూడా కత్తులతో దాడి చేశారు, వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో కొందరు గాయపడ్డారు.

Read Also:RTA officials: రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్కూల్ బస్సులపై ఆర్టీఏ కోరడా

సంఘటన గురించి సమాచారం ఇస్తూ, సైరాక్యూస్ పోలీసు ప్రతినిధి లెఫ్టినెంట్ మాథ్యూ మాలినోవ్స్కీ మాట్లాడుతూ కాల్పులు, కత్తిపోట్లు సంఘటన 12.22 గంటలకు జరిగిందని చెప్పారు. పోలీసుల సమాచారం ప్రకారం, సంఘటన సమయంలో డేవిస్ స్ట్రీట్, మస్సేనా స్ట్రీట్ ప్రాంతంలో రహదారిపై భారీ గుంపు ఉంది. ప్రమాదం సమయంలో చాలా మందిని వాహనాలు కూడా ఢీకొన్నాయి. కొంతమంది కత్తిపోట్లకు గురయ్యారు. మరికొందరు కాల్చి చంపబడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరి వయస్సు 17 నుంచి 25 ఏళ్లలోపు ఉంటుందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. గాయపడిన వారిలో పలువురు మహిళలు కూడా ఉన్నారు. వారిలో ఒకరికి 20 ఏళ్లు కాగా, మరొకరి వయసు 22 ఏళ్లు. ఒకరికి కుడి తుంటిలో బుల్లెట్, మరొకరికి తుంటి, నడుము భాగంలో బుల్లెట్ ఉంది.

అంతే కాకుండా వేగంగా వస్తున్న వాహనం ఢీకొని పలువురు మహిళలు, పురుషులు కూడా గాయపడ్డారు. వాహనం ఢీకొనడంతో 24 ఏళ్ల యువతి రోడ్డుపై పడిపోయింది. కత్తులతో పొడిచి, వాహనాలతో తొక్కి చంపిన ఘటన కాల్పుల తర్వాత జరిగిందా లేక ముందు జరిగిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. నిందితుడి అరెస్టుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, పార్టీ కోసం ప్రేక్షకులు గుమిగూడారని సైరాక్యూస్ పోలీస్ చీఫ్ జో సెసిల్ చెప్పారు. ఇందులో హైస్కూల్, కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నారు. పార్టీకి అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం మొత్తం కేసు దర్యాప్తు కొనసాగుతోందని, చుట్టుపక్కల ప్రాంతాల్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీ ద్వారా నేరగాళ్లను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Read Also:Shocking Video: రైలు వస్తుంటే ఎదురెళ్లి.. పట్టాలపై పడుకున్న యువకుడు