Site icon NTV Telugu

Astrology 2023: కొత్త ఏడాదిలో ఈ మూడు రాశులవారికి పట్టిందల్లా బంగారమే..

Signs

Signs

Astrology 2023: జాతకాలు, జ్యోతిష్యాలు ఉన్నాయో లేదో తెలియదు.. కానీ, పెద్దల నమ్మకం బట్టి వాటిని నమ్ముతూ ఉంటాం. అయితే సాధారణంగా నమ్మితే పర్లేదు కానీ.. మూఢ నమ్మకాలు మాత్రం పెట్టుకోకూడదు. ఇక ఈ ఏడాది ఎలా జరిగింది అనేది రివైండ్ చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. కొంతమందికి ఈ ఏడాది మంచి ఇచ్చి ఉండవచ్చు.. మరికొంతమందికి చెడును ఇచ్చి ఉండవచ్చు. కానీ ఏది జరిగినా ముందు వచ్చే ఏడాది మాత్రం మంచి జరుగుతుందనే నమ్మకంతోనే అడుగుపెట్టాలి. ఇక వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం కొత్త ఏడాదిలో కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమేనట. అందుకు కారణం 2023 సంవత్సరంలో.. అనేక ప్రధాన గ్రహాలు తమ రాశులను మార్చుకోనున్నాయని తెలుస్తోంది.

ముఖ్యంగా గురుడు అనగా బృహస్పతి రాశి మార్చుకోనుండడంతో మూడు రాశుల వారికి లాభం చేకూరుతుందట. అవేంటంటే.. మేషరాశి, మిథున రాశి, ధనస్సు రాశి వారికి కొత్త ఏడాది మంచి జరుగుతుందని జ్యోతిషశాస్త్రం చెప్తోంది. ఈ రాశుల వారికి 2023 తర్వాత గురుగ్రహం రాశి మారడం వల్ల ఏర్పడిన గజలక్ష్మి యోగం పట్టనున్నదట. ఇక ఈ రాశిలో ఉన్నవారికి కొత్త ఏడాది వ్యాపార రంగంలో పట్టిందల్లా బంగారమే అని, వైవాహిక బంధంలో చికాకులు తొలగుతాయని జ్యోతిషశాస్త్రం చెప్తోంది. గజలక్ష్మీ యోగం వల్ల మంచి లాభాలను పొందవచ్చట. ఉద్యోగస్తులకు మంచి సమయం లభిస్తుందని, పెళ్లికానివారికి పెళ్లి యోగం కూడా ఉన్నట్లు రాసి ఉంది.

Exit mobile version