NTV Telugu Site icon

Ashok Hotel: త్వరపడండి.. అమ్మకానికి చారిత్రాత్మక అశోకా హోటల్

Ashoka Hotel

Ashoka Hotel

Ashok Hotel: దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక అశోకా హోటల్ ను అసెట్ మానిటైజేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విక్రయించనుంది. దీనితోపాటు మరో హోటల్, సర్వీస్డ్ అపార్ట్‌మెంట్, ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం 21.5 ఎకరాల కాంప్లెక్స్‌లో భూమిని కూడా ఇస్తుంది. పబ్లిక్‌-ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో జరగనున్న మానిటైజేషన్‌ ప్రక్రియలో భాగంగా ఈ ఐకానిక్‌ హోటల్‌ విలువను రూ.7,409 కోట్లుగా నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అశోకా హోటల్ వేలంలో కొనుగోలు చేసిన వారు హోటల్‌లో చాలా మార్పులు చేయవచ్చు, కానీ హోటల్ బయట డిజైన్ మార్చడానికి అనుమతించబడదు.

Read Also: EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. గరిష్ఠ వేతన పరిమితి పెంపు

Read Also:Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థినులకు వేధింపులు?

దేశ రాజధాని నడిబొడ్డులో ఉన్న ఈ 25 ఎకరాల ప్రాపర్టీ అమ్మకం కోసం ఇన్వెస్టర్లతో సంప్రదింపులు ఇప్పటికే జరుగుతున్నాయని, ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఆమోదమే తరువాయని వారన్నారు. గతేడాది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఎన్‌ఎంపీలో భాగంగా ఆశోకా హోటల్‌, దానిపక్కనే ఉన్న హోటల్‌ సామ్రాట్‌ సహా ఇండియా టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌కు చెందిన 8 ఆస్తులను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ఎంఎన్‌పీలో భాగంగా ఆయా రంగాల్లోని మౌలిక ఆస్తుల విక్రయం ద్వారా నాలుగేళ్లలో రూ.6 లక్షల కోట్లు సమీకరించనున్నట్లు 2021 ఆగస్టులో సీతారామన్‌ వెల్లడించారు.

Show comments