Aryaveer Sehwag: తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే వ్యక్తిగా పేరున్న వారిలో భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు. ఇప్పుడు అదే దూకుడును అతడి కుమారుడు “ఆర్యవీర్ సెహ్వాగ్” కూడా కొనసాగిస్తున్నాడు. అండర్-19 వన్డే ఆసియా కప్ 2026లో భాగంగా యూఏఈతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆర్యవీర్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఏకంగా 168 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 160 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఒమన్‌లోని అల్ అమరత్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన గ్రూప్-A చివరి మ్యాచ్‌లో యూఏఈ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పిచ్‌పై బంతి కొంతమేర టర్న్ అవుతుండటంతో బ్యాటింగ్ అంత సులభంగా సాగలేదు. అయినప్పటికీ ఆర్యవీర్ ఆరంభంలో ఆచితూచి ఆడుతూ క్రీజులో నిలదొక్కుకున్నాడు. ఆ తర్వాత తనదైన శైలిలో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ లక్ష్య రాయ్చందానితో కలిసి తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించాడు. ఆపై వికే వినీత్‌తో కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 193 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వినీత్ కూడా 67 పరుగులతో రాణించాడు. ఆర్యవీర్ 131 బంతుల్లో తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడుతూ బౌండరీలు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సిక్సర్ బాది 150 పరుగుల మార్కును కూడా అందుకున్నాడు. చివరకు 45వ ఓవర్లో నసీమ్ ఖాన్ బౌలింగ్‌లో ఉద్దీష్ సూరికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆర్యవీర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్ 309 పరుగుల భారీ స్కోరు సాధించింది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఆర్యవీర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
తండ్రికి ఇచ్చిన మాట..
ఈ మ్యాచ్‌లో తన ప్రదర్శనపై ఆర్యవీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిచ్‌పై బంతి తిరుగుతుండటంతో ఆరంభంలో కాస్త ఇబ్బంది ఎదురైందని తెలిపాడు. అయితే మొదటి నుంచే ఎక్కువసేపు క్రీజులో ఉండి 40 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. డాట్ బాల్స్ గురించి ఆందోళన చెందకుండా తన ఆటపై దృష్టి పెట్టానని, తర్వాత వాటిని భర్తీ చేయగలననే నమ్మకం ఉందని వెల్లడించాడు. అంతేకాకుండా మ్యాచ్‌కు ముందు ఒక వ్యక్తికి భారీ స్కోరు చేస్తానని మాట ఇచ్చానని.. ఆ వ్యక్తి తన తండ్రి వీరేంద్ర సెహ్వాగ్ అని ఆర్యవీర్ తెలిపాడు. తన తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఉందని, ఆయనకు కూడా భారీ సెంచరీలు అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు.
సెమీస్‌లోకి ఎంట్రీ
భారత్ నిర్దేశించిన 310 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ జట్టు 239 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. యూఏఈ బ్యాటర్లలో అహ్మద్ ఖుదాదాద్ 74 పరుగులు, నూరుల్లా అయూబీ 39 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో ఈశాన్ సూద్ అద్భుతంగా బౌలింగ్ చేసి 37 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇతర బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో యూఏఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఇంతకుముందు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలవడంతో సెమీఫైనల్ చేరాలంటే యూఏఈపై తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కీలక మ్యాచ్‌లో భారీ విజయాన్ని అందుకోవడంతో టీమిండియా సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇప్పుడు సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ తలపడనుంది. నవంబర్ 12, గురువారం ఈ మ్యాచ్ జరగనుంది.
पहले मैच में अर्धशतक और अब तीसरे मैच में शानदार शतक..🔥
Aryaveer Sehwag ने अपने बल्ले से बता दिया है कि वह लंबी रेस के घोड़े हैं।
वीरेंद्र सहवाग के बेटे जूनियर सहवाग ने भारतीय क्रिकेट में अपने इरादे साफ कर दिए हैं। अभी तो शुरुआत है!
https://t.co/ToznW2Wbd4
— मिच्च मसाला (@micchamasala) November 10, 2026

