Site icon NTV Telugu

Arvind Kejriwal: కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫొటోలు ముద్రించాలి..

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫొటోలు ముద్రించాలని కేంద్రాన్ని కేజ్రీవాల్‌ డిమాండ్ చేశారు. తాజా కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేష్‌ చిత్రాలను చేర్చాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కొత్త కరెన్సీ నోట్లపై ఒకవైపు మహాత్మాగాంధీ చిత్రపటం, మరోవైపు లక్ష్మీదేవి, గణేష్ చిత్రాలు ఉండవచ్చని ఆయన తన విజ్ఞప్తిలో పేర్కొన్నారు.కరెన్సీ నోట్లపై ఇద్దరు దేవతల చిత్రాలు ఉండడం వల్ల దేశం అభివృద్ధి చెందుతుందని కేజ్రీవాల్ అన్నారు.ప్రయత్నాలు చేసినప్పటికీ, కొన్నిసార్లు దేవతలు ఆశీర్వదించకపోతే ప్రయత్నాలు ఫలించవన్నారు. ఇండోనేషియా లాంటి ముస్లిం దేశం గణేష్‌ బొమ్మలు ముద్రిస్తుంటే మన దేశంలో ఎందుకు ముద్రించడం లేదని ప్రశ్నించారు.

Somu Veerraju Letter to CM: సీఎంకు సోము వీర్రాజు బహిరంగ లేఖ.. భద్రాద్రి రాముడి ఆస్తులు కాపాడండి..!

దీనిపై రెండు రోజుల్లో ప్రధానికి లేఖ రాస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత చెప్పారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడంతో దేశం ‘సున్నితమైన’ పరిస్థితిని ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని సుస్థిరపరిచే ప్రయత్నాలే కాకుండా సర్వశక్తిమంతుడి ఆశీస్సులు మనకు అవసరం అని కేజ్రీవాల్ అన్నారు.గుజరాత్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Exit mobile version