Site icon NTV Telugu

BJP MLA Jambey Tashi: అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సోదరుడు కన్నుమూత

Bjp Mla

Bjp Mla

BJP MLA Jambey Tashi: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుణాచల్‌ప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే జంబే తాషి కన్నుమూశారు. ఈ మేరకు కుటుంబసభ్యులు ధ్రువీకరించారు. తాషి ముఖ్యమంత్రి పెమా ఖండూ సోదరుడే. తాషికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తాషి తవాంగ్ జిల్లాలోని లుమ్లా నియోజకవర్గం నుంచి మూడుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అరుణాచల్ ప్లానింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మంత్రికి సలహాదారుగా పనిచేశారు.

Gujarat Tragedy: మోర్బీ వంతెన దుర్ఘటన ‘యాక్ట్ ఆఫ్ గాడ్‌’.. ఒరేవా మేనేజర్‌ వాదనలు

సోదరుడి మృతి పట్ల ముఖ్యమంత్రి పెమా ఖండూ విచారం వ్యక్తం చేశారు. లుమ్లా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన జంబే తాషి జీ మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాదం పట్ల తాను చాలా బాధపడ్డానన్నారు. తాషి కుటుంబ సభ్యులకు తోడుగా నిలుస్తానని అన్నారు. ఒకప్పుడు మారుమూల, అభివృద్ధి చెందని లుమ్లా నియోజకవర్గం నేడు రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మారిందని ముఖ్యమంత్రి అన్నారు.

Exit mobile version