మనం మన ఫోన్ కి ఛార్జింగ్ పెట్టే విషయంలో చాలా సార్లు మార్చిపోతుంటాం. కానీ, మనం ఫోన్ కి ఛార్జింగ్ పెట్టడం మార్చిపోయి..అలాగే ఆఫీసులకు వెళ్లిపోతుంటాం.. అక్కడి వెళ్లి చూసుకుంటే.. లో బ్యాటరీ.. లేదా ఫోన్ స్వీచ్ ఆఫ్ కావడం జరుగుతుంది. దీంతో మనం తోటి వారి దగ్గర ఛార్జర్ అడిగి మరీ ఫోన్ ఛార్జింగ్ పెడతాం. కానీ ఇతరుల ఛార్జర్ వినియోగించడం చాలా ప్రమాదం.. ఎందుకో తెలుసా.. మీ ఛార్జర్ కి బదులు ఇతరుల ఛార్జర్ ఉపయోగించడం వల్ల మీ ఫోన్ బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది. మీ ఫోన్‌తో పాటు వచ్చే ఛార్జర్ స్పెషల్ గా మీ ఫోన్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి మాత్రమే తయారు చేయబడింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇది మీ ఫోన్‌కు సరైన పరిమాణం, సరైన వోల్టేజ్ తోకనెక్టర్‌తో వస్తుంది.
Read Also: Maamannan: తెలుగులో రిలీజయ్యి వారం కూడా కాలేదు.. అప్పుడే ఓటీటీలోకి!
అయితే.. చాలా మందికి అనేక ప్రశ్నలు వస్తుంటాయి. నా ఫోన్ కి మరొక మొబైల్ ఛార్జర్ ను వాడటం వల్ల కలిగే నష్టాలేమిటి అనే అనుమానం వస్తుంది. ఇంకో ఛార్జర్ యొక్క వోల్టేజ్ చాలా ఎక్కువగా ఉంటే, అది మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ ను బాగా దెబ్బతీస్తుంది.. దీంతో పాటు వోల్టేజ్ తక్కువగా ఉంటే.. అది మీ ఫోన్‌కు ఛార్జింగ్ కాకుండా చేస్తుంది. దీంతో.. మీ మొబైల్ ఫోన్ కు ఇతరుల ఛార్జర్ ను ఉపయోగించినప్పుడు మీ ఫోన్ బ్యాటరీ హీట్ అవుతుంది. ఇక, కొన్ని సందర్భాల్లో ఈ ఫోన్ లో మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ ఫోన్‌తో పాటు వచ్చిన ఛార్జర్‌ను ఉపయోగించాలని లేదా అవసరమైతే అదే బ్రాండ్‌కు చెందిన కొత్త ఛార్జర్‌ని కొనుగోలు చేయాలని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Also: IRCTC: కీలక నిర్ణయం.. ఇక ఆటోమేటిక్‌గా రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. 0.35 పైసలకే..