Ragging Death: కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని మదనాయకనహళ్లి ప్రాంతంలో ఓ విద్యార్థి ర్యాగింగ్ వల్ల మనస్థాపానికి గురై జీవితాన్ని ముగించిన విషాద సంఘటన చోటు చేసుకుంది. దారుణంగా ర్యాగింగ్‌కు గురైన అనంతరం, బాధను భరించలేక తన చివరి వీడియోను తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు హసన్ జిల్లా చెందిన చన్నకేశవ, తులసి దంపతుల కుమారుడు వరుణ్ (22). బెంగళూరులోని ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ కాలేజీలో చదువుతున్న వరుణ్.. తనపై కాలేజీలో కొందరు స్నేహితులు ర్యాగింగ్ చేస్తున్నారనే విషయాన్ని సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు. అనంతరం ఈ వీడియోను కాలేజీ అధికారిక వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేసి, ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Earthquake: హర్యానాలో భూకంపం… ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో స్వల్ప ప్రకంపనలు
జూలై 10న వరుణ్ కాలేజీ నుండి ఇంటికి తిరిగివచ్చాడు. కానీ జూలై 11న తల్లిదండ్రులు పని కోసం బయటికి వెళ్లిన సమయంలోనే ఇంట్లో ఉరివేసుకొని చనిపోయాడు. కాలేజీ గ్రూపులో అతని వీడియో చూసిన అధికారులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కానీ, వారు ఇంటికి చేరేసరికి వరుణ్ ప్రాణాలు కోల్పోయాడు. వరుణ్ డ్రాయింగ్ లో అపార ప్రతిభ కలిగినవాడు. కొన్ని నిమిషాల్లోనే ఎవరి ముఖాన్ని అయినా చిత్రించగలిగే సత్తా ఉండేది. అనేక ప్రముఖుల చిత్రాలు వేసి ప్రశంసలు అందుకున్నాడు. చదువులోనూ, కళల్లోనూ తొలి స్థానంలో ఉండే ఈ యువకుడి జీవితం ఇలా ఆత్మహత్యగా ముగియడంతో అతని కుటుంబం తట్టుకోలేకపోతుంది.
James Cameron : అవతార్ – 3 ఫస్ట్ లుక్ రిలీజ్.. ట్రైలర్ డేట్ ఇదే
ఈ ఘటనపై మదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ర్యాగింగ్‌కు పాల్పడ్డ విద్యార్థులపై చర్యలు తీసుకునే క్రమంలో విచారణ సాగుతోంది. వరుణ్ కుటుంబం మాత్రం న్యాయం కోరుతూ బాధతో విలపిస్తోంది. ఈ ఘటన మరోసారి కాలేజీల్లో ర్యాగింగ్ ఉన్మాదం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా తెలియజేస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును సంరక్షించాల్సిన స్థలాల్లో, మానసిక బాధలు, హింస చెలరేగుతుండటం తల్లిదండ్రులకు భయాందోళనలు కలిగిస్తోంది. ప్రభుత్వం, విద్యాసంస్థలు మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
