NTV Telugu Site icon

Shambhala: నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘శంబాల’.. భయపెట్టిస్తున్న అర్చన అయ్యర్ ఫస్ట్ లుక్..

Shambhala

Shambhala

యంగ్ హీరో ఆది సాయి కుమార్ శంబాల అనే సినిమా చేస్తున్నారు. శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్‌ అంటూ రాబోతోన్న ఈ చిత్రానికి A (యాడ్ ఇన్ఫినిటమ్) ఫేమ్ యుగంధర్ ముని డైరెక్షన్ చేస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీలో ఆది సాయి కుమార్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం వాస్తవానికి దూరంగా మరో ప్రపంచంలో జరిగే కథలకు ఆడియన్స్‌ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి ఓ మిస్టిక్ వరల్డ్‌లో రూపొందుతున్న సినిమా ‘శంబాల’. మేకర్లు ఈ చిత్రంలోని ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల ఆది సాయి కుమార్ బర్త్ డే సందర్భంగా వదిలిన స్పెషల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.

READ MORE: Oh Bhama Ayyo Rama: వాలెంటైన్స్ డే స్పెషల్.. ‘ఓ భామ అయ్యో రామ’ పోస్టర్ విడుదల..

నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్‌’లో అర్చన అయ్యర్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దేవీ పాత్రలో అర్చన అయ్యర్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అర్చన ఎరుపు చీర ధరించింది. ఇంటెన్స్ ఎమోషన్స్‌ను పలికిస్తూ కనిపించింది. బ్యాక్ గ్రౌండ్‌లో పంట, గుడి, పక్షులు, దిష్టిబొమ్మ ఇలా అన్నీ ఆసక్తికరంగా, భయానకంగా ఉన్నాయి. అత్యున్నత నిర్మాణం, సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో ఈ చిత్రం ఉండబోతోందని యూనిట్ తెలిపింది. ప్రత్యేకమైన కథ, గ్రిప్పింగ్ కథనం, హై స్టాండర్డ్స్ వీఎఫ్ఎక్స్‌తో ఆడియెన్స్‌కు గొప్ప అనుభూతిని అందించనున్నట్లు పేర్కొంది. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహిస్తున్నారు.