Site icon NTV Telugu

Alluri District: అరకులోయలో తప్పిన పెను ప్రమాదం.. పట్టాలపై జారిపడ్డ భారీ బండరాయి..

Train

Train

Alluri District: అల్లూరి జిల్లా అరకులోయలో పెను ప్రమాదం తప్పింది. ఓ పెద్ద బండరాయి కేకే లైన్లో పట్టాలపై జారిపడింది. టైడా, చిమిడిపల్లి రైల్వే స్టేషన్ ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో గూడ్స్ రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖలో అరకు కిరండోల్ పాసింజర్ రైలు నిలిచిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు బండరాయి జారిపడినట్లు చెబుతున్నారు. గతంలో సైతం ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.

READ MORE: UP: భర్త ఇంటి నుంచి రూ. 30 లక్షలు దోచిన మహిళ.. సోదరుడి ప్రాణాల కోసం..

Exit mobile version