NTV Telugu Site icon

APSRTC CARGO: APSRTC మరో ముందడుగు.. ఇక డోర్ టు డోర్ కార్గో సేవలు

Apsrtc

Apsrtc

APSRTC ప్రయాణికులకు ఒకవైపు మెరుగైన సేవలు అందిస్తూనే.. మరోవైపు ఆదాయం పెంచుకునే మార్గాలు అనుసరిస్తోంది.. తాజాగా APSRTCలో డోర్ టు డోర్ కార్గో సేవలను ప్రారంభించారు మంత్రి విశ్వరూప్, ఆర్టీసీ ఎండీ తిరుమలరావు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ మాట్లాడారు. సంస్థను లాభాల బాట పట్టించటానికి ఏపీ ఎస్ ఆర్టీసీ (APSRTC) మరో ముందడుగు వేసిందన్నారు. ఉగాది నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. ANL పార్సిల్ సర్వీస్ తో గతంలో తొమ్మిది కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఆర్టీసీ సొంతగా చేయడం ద్వారా 168 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు.

Read Also: Finland : ప్రపంచంలోనే అత్యంత హ్యాపీయస్ట్ దేశం

ఇది ఐదు వందల కోట్ల వరకు పెరుగుతుందని మంత్రి విశ్వరూప్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే ఆర్టీసి నష్టం తగ్గిందని, ఇంకా తగ్గించేవిధంగా అంతా పనిచేయాలన్నారు. షిప్ మంత్ర యాప్ ద్వారా డెలివరీ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. APSRTC ఎండీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. డోర్ డెలివరీ తో పాటు డోర్ పిక్ అప్ కూడా చేయాలని ఆలోచన ఉందన్నారు. షిప్ మంత్ర యాప్ ద్వారా డోర్ టు డోర్ డెలివరీ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశాం అని వివరించారు. ప్రస్తుతానికి విజయవాడ, విశాఖపట్నంలోనే ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, తర్వాత ప్రధాన నగరాలకు విస్తరిస్తామన్నారు. దేశంలో ఎక్కడా కూడా ఈ సేవలు లేవన్నారు. ఈ సేవలను APSRTC వెబ్ సైట్ ద్వారా కానీ shipmanthra యాప్ ద్వారా కానీ వినియోగించుకోవచ్చు అని ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

Read Also: Revanth Reddy: హాత్ సే హాత్ జోడో యాత్ర కు ఐదు రోజులు బ్రేక్