తమిళ రాజకీయాల్లో మరియు సినీ వర్గాల్లో ఇప్పుడు అంతా దళపతి విజయ్ గురించే చర్చ నడుస్తోంది. తన రాజకీయ ప్రస్థానాన్ని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీతో ఘనంగా ప్రారంభించాడు విజయ్. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న విజయ్ కు వ్యక్తిగత జీవితంలో అనుకోని ఇబ్బంది ఎదురైంది. విజయ్ తో విడాకులు కావాలని ఆయన భార్య సంగీత కోర్టు మెట్లు ఎక్కింది. కాగా విజయ్ ఇప్పుడు తన వ్యక్తిగత మరియు రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కుంటున్నాడు. అయితే రాబోయే ఏప్రిల్ నెల విజయ్ జీవితాన్ని మలుపు తిప్పబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : Peddi : పెద్దిలో స్పెషల్ సాంగ్.. నలుగురు అందగత్తెల కోసం బుచ్చి సెర్చింగ్
ముఖ్యంగా ఏప్రిల్ 20వ తేదీన విజయ్ విడాకులకు సంబంధించిన తుది తీర్పు వచ్చే అవకాశం ఉందని సమాచారం. గత కొంతకాలంగా విజయ్ తన భార్య సంగీతతో విడిపోయి ఉంటున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఈ తీర్పుతో వారి బంధానికి అధికారికంగా ముగింపు పడనుంది. వ్యక్తిగత జీవితంలో ఒంటరి ప్రయాణం ఖాయమని అర్థమవుతున్న తరుణంలో, అటు రాజకీయాల్లో కూడా ఆయన ‘ఒంటరి పోరు’కే సిద్ధమయ్యారు. ఎవరితోనూ పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి దిగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విడాకుల విషయంపై విజయ్ స్పందిస్తూ.. “నా కోసం ఎవరూ బాధపడొద్దు.. మీరు బాధపడితే నేను తట్టుకోలేను. నా సమస్యలను నేనే స్వయంగా పరిష్కరించుకోగలను” అంటూ అభిమానులకు ధైర్యం చెప్పారు. భార్యకు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది, కానీ ఏప్రిల్ 23న జరగబోయే పోలింగ్‌లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. వ్యక్తిగత బాధలను పక్కన పెట్టి, ప్రజల కోసం ఆయన చేస్తున్న ఈ పోరాటాన్ని ఓటర్లు ఎలా ఆదరిస్తారో చూడాలి.
