Site icon NTV Telugu

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు

Telangana

Telangana

Telangana Govt: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం వరుస సమావేశాలతో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేసింది. ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఏడుగురు సలహాదారుల నియామకాలను సీఎస్ ర‌ద్దు చేశారు.

Read Also: BJP: రాజ్భవన్లో గవర్నర్ ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు

ప్రభుత్వ సలహాదారులైన సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా రాజీవ్ శర్మ, ఇరిగేషన్ అడ్వైజర్‌గా ఉన్న ఎస్కే జోషి, సాంస్కృతిక, దేవాదాయ సలహాదారుగా కేవీ రమణా చారి(ఇటీవల రాజీనామా చేశారు), అటవీ సంరక్షణ శాఖ ముఖ్య సలహాదారుగా శోభ, హోంశాఖ సలహాదారుగా అనురాగ్ శర్మ, ముస్లిం మైనారిటీ సంక్షేమ సలహాదారుగా ఏకే ఖాన్, ఫైనాన్స్ డిపార్టుమెంట్‌లో స్పెషల్ ఆఫీసర్ హోదాలో జీఆర్ రెడ్డి, శివశంకర్, ఆర్ అండ్ బీ శాఖలో సుధాకర్ తేజ, అగ్రికల్చర్ ముఖ్య సలహాదారు చెన్నమనేని రమేష్, ఇంధన సెక్టార్‌లో రాజేంద్ర ప్రసాద్ సింగ్, ఉద్యాన శాఖలో శ్రీనివాస్ రావు ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ సీఎస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

 

Exit mobile version