Site icon NTV Telugu

NMDC: నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లో 934 జాబ్స్.. మిస్ చేసుకోకండి

Jobs

Jobs

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి ఇదే మంచి సమయం. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీగా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇటీవల నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC) స్టీల్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 934 పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీకానున్నాయి. అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్‌, బీఈ, డిప్లొమా, ఐటీఐ, పీజీ, సీఏ, ఎంఏ, ఎంబీఏ/ పీజీడీఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 50 ఏళ్లు ఉండాలి.

Also Read:CNG Car Mileage: సులభమైన మార్గాలతో సీఎన్జీ కార్ల మైలేజ్ ఎలా పెంచుకోవాలంటే?

రాయ్‌పూర్, భువనేశ్వర్, రూర్కెలా, బొకారో, దుర్గాపూర్, హోస్పేట్, ఝార్సుగూడ వంటి అనేక ప్రదేశాలలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000 – రూ.1,70,000 వరకు జీతం ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ. 500 చెల్లించాలి. SC, ST, PwBD, మాజీ సైనికుల వర్గాలకు చెందిన వారికి ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు మే 8 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version