జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 976 పోస్టులను భర్తీ చేయనున్నారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు ఆర్కిటెక్చర్/ఇంజనీరింగ్/టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఐటీ సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ, ఇతర నిర్ణీత అర్హత కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి గేట్ స్కోర్ కూడా తప్పనిసరి. అలాగే, అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 సెప్టెంబర్ 2025 నాటికి 27 సంవత్సరాలుగా నిర్ణయించారు.
Also Read:Rahul Gandhi: పేదోళ్ల ఓట్లే తొలగించారు.. మరిన్ని ఆధారాలు బయటపెడతా
ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు కల్పించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు జీతం చెల్లిస్తారు. దరఖాస్తు ప్రక్రియ ఈరోజు అంటే ఆగస్టు 28 నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 27 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
