Site icon NTV Telugu

Central Bank Of India Recruitment 2025: జస్ట్ డిగ్రీ పాసైతే చాలు.. 4500 బ్యాంకు జాబ్స్ మీవే..

Jobs

Jobs

బ్యాంకు జాబ్స్ కు ఉండే క్రేజ్ వేరు. బ్యాంకు జాబ్ సాధించాలాని ఏళ్ల తరబడి ప్రిపరేషన్ కొనసాగిస్తుంటారు. మీరు కూడా అలా సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 4500 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో తెలంగాణలో 100, ఏపీలో 128 పోస్టులు భర్తీకానున్నాయి. ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు భారత ప్రభుత్వం ఆమోదించిన గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి.

Also Read:SSMB 29 : రాజమౌళి- మహేశ్ బాబు మూవీ రిజెక్ట్ చేసిన స్టార్ హీరో..

మే 31, 2025 నాటికి 20- 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. NATS (నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్) పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియలో BFSI సెక్టార్ స్కిల్ కౌన్సిల్ నిర్వహించే ఆన్‌లైన్ పరీక్ష, ఆ తర్వాత సంబంధిత రాష్ట్ర స్థానిక భాష పరీక్ష ఉంటుంది. తాత్కాలికంగా అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, BFSI SSC వెబ్‌సైట్‌లలో ప్రచురిస్తారు. PwBD అభ్యర్థులు రూ. 400, SC/ST/మహిళలు/EWS అభ్యర్థులు రూ. 600, ఇతర అభ్యర్థులు రూ. 800 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 23 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version