బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 2,700 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. ఇతర అర్హత ప్రమాణాలను కూడా కలిగి ఉండాలి. అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 20 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Also Read:Kishan Reddy: మా పార్టీ బలహీనంగా ఉంది.. మేము ఉన్నంతలో ప్రయత్నం చేశాం..
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు, వికలాంగులకు 10 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్థానిక భాషా పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్రెంటిస్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15,000 స్టైఫండ్ లభిస్తుంది. జనరల్, OBC, EWS అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.800, వికలాంగ అభ్యర్థులకు రూ. 400 చెల్లించాలి. SC, ST అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ విధానంలో డిసెంబర్ 1 2025 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
