AP Vehicle Sales down: ఆంధ్రప్రదేశ్‌లో ద్విచక్ర వాహనాల విక్రయాలు భారీగా తగ్గాయి. దీంతో.. గత ఆర్థిక సంవత్సరంలో నెగెటివ్ గ్రోత్ నమోదైంది. అంతకుముందు సంవత్సరం 6 లక్షల 89 వేల బైక్‌లు అమ్ముడుపోగా గతేడాది 6 లక్షల 34 వేల వాహనాలు మాత్రమే సేలయ్యాయి. అంటే.. ఏడాదిలో ద్విచక్ర వాహనాల విక్రయాలు 55 వేలు పడిపోయాయి.
read more: Super Success Story: ప్రతిఒక్కరూ చూడాల్సిన ప్రత్యేక ఇంటర్వ్యూ. వహ్‌వా అనిపించే విజయగాథ
మరోవైపు.. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకల్లో మాత్రం యావరేజ్‌గా 30 శాతం చొప్పున బండ్ల అమ్మకాలు పెరిగాయి. అధికారిక లెక్కల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఏపీలో టూవీలర్ల సేల్స్ ఆరున్నర శాతానికి పైగా
క్షీణించాయి.
ద్విచక్ర వాహనాలే కాకుండా.. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని కేటగిరీల వాహనాల కొనుగోళ్లు కూడా ఒకటీ పాయింట్ ఏడు ఆరు శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. జాతీయ స్థాయిలో ఈ ఏడాది ప్రథమార్ధంలో 67 లక్షల 27 వేల 806 బైక్‌లు అమ్ముడుపోగా గతేడాది 53 లక్షల 37 వేల 389 వాహనాల సేల్స్ జరిగాయి.
అంటే.. 26 శాతానికి పైగా గ్రోత్ సాధించాయి. ఇదిలాఉండగా.. కార్ల విక్రయాలు కూడా చెప్పుకోదగ్గ వృద్ధి సాధించలేదు. జాతీయ సగటు 21 శాతంతో పోల్చితే 8 పాయింట్ రెండు ఏడు శాతం మాత్రమే పెరిగింది.