Site icon NTV Telugu

Atchannaidu: సీఎం జగన్‌కు అచ్చెన్నాయుడు లేఖ.. దేనికోసమంటే..!

Latter

Latter

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి (CM Jagan) టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని బహిరంగ లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు.

లేఖలో ఏముందంటే..
రాష్ట్ర ప్రజలకు తాగునీరు సరఫరా (Drining Water) చేయలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం (YCP Government) ఉండటం సిగ్గుచేటు అని అచ్చెన్నాయుడు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో సురక్షిత నీరు అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయం ముఖ్యమంత్రికి తెలుసా?, గుంటూరులో కలుషిత జలంతో ప్రబలుతున్న డయేరియా, కలరా కేసులు నమోదవుతున్నాయని గుర్తుచేశారు. లక్షలాది మంది ఆస్పత్రి పాలవుతున్నా పట్టకపోవడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనన్నారు. గుంటూరులో డయేరియాతో నలుగురు మృతి చెందారని.. మరో ముగ్గురికి కలరా వ్యాధి సోకిందని తెలిపారు.

సిద్ధం సభలపై ఉన్న శ్రద్ధ ముఖ్యమంత్రికి ప్రజల ప్రాణాలపై లేకపోవడం బాధాకరమని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. అధికారంలో ఉండే ఈ నెల రోజులైనా ప్రజల గురించి ఆలోచించాలని కోరారు. వెంటనే ప్రజలకు సురక్షిత నీరు అందించాలని.. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని లేఖలో అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.

Exit mobile version