NTV Telugu Site icon

Ap Rains : ఏపీలో భారీ వర్షాలు..ఆ జిల్లాల్లో మరో మూడు రోజులు వర్షాలు..

Ap Rains (2)

Ap Rains (2)

దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే జల దిగ్బందంలో ఉన్నాయి.. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.. తెలంగాణాలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మరో మూడు రోజులు భారీ వర్షాలు కూరవనున్నాయని అధికారులు వెల్లడించారు… కొమురంభీం జిల్లాలోని కాగజ్‌నగర్‌ పెద్దవాగులో నీటి ప్రవాహం పెరిగింది. కాగజ్‌గనర్‌ మండలం అందవెల్లి బ్రిడ్జి తాత్కాలిక రోడ్డు నీట మునిగింది. వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.. కాగజ్‌నగర్‌-దహెగాం రవాణ వ్యవస్థ పూర్తిగా బ్రేక్‌ పడినట్లయింది. కాగజ్‌నగర్‌ అందవెల్లి పెద్దవాగులో ఒకరు గల్లంతయ్యారు. పెద్దవాగు దాటే క్రమంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. దాంతో సదరు వ్యక్తి నీటిలో కొట్టుకుపోయారు. దీంతో అధికారులు అలెర్ట్ అయ్యారు..

పలు ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురవనున్నాయి.. తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

మరో వైపు ఏపీ లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. దాంతో.. నంద్యాల జిల్లాతోపాటు పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. మరో రెండు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ఊపందుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో వారం రోజులుగా మంచి వర్షాలు లేకుండా పోయాయి.. ఇప్పుడు బంగాలఖాతంలో ఆవర్తనం ఏర్పడింది.. దీంతో మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. కాగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు..

Show comments