AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..

Pensions

Pensions

ఏపీలో అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి సంబంధించి షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. సాధారణంగా ప్రతి నెలా మొదటి తేదీ ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుంది. అయితే ఈసారి అక్టోబర్ 1వ తేదీన ఉదయం కాకుండా మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీని చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.

ఈ మార్పునకు ప్రధాన కారణం బ్యాంకు ఉద్యోగుల సమ్మె. ఈ నెల 28, 29, 30 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు. దీనివల్ల బ్యాంకింగ్ లావాదేవీలపై ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు అక్టోబర్ 1వ తేదీ ఉదయం నేరుగా బ్యాంకులకు వెళ్లి పింఛన్లకు సంబంధించిన నిధులను డ్రా చేయాల్సి ఉంటుంది.

బ్యాంకుల నుంచి నగదు తీసుకువచ్చిన వెంటనే, అదే రోజు మధ్యాహ్నం నుంచి లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ ప్రక్రియను సజావుగా ప్రారంభించేలా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.