AP New DWCRA Schemes 2026: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాల ప్రారంభం!

  • డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్
  • మార్చి 8న రెండు కొత్త పథకాల ప్రారంభం
  • మహిళల కుటుంబ, విద్యా అవసరాలకు ఆర్థిక భరోసా
Ap New Dwcra Schemes 2026

Ap New Dwcra Schemes 2026

AP New DWCRA Schemes 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. మహిళా సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో మార్చి 8న రెండు కీలక సంక్షేమ పథకాలను ప్రారంభించనుంది. మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ప్రవేశపెట్టనున్న ఈ పథకాలు మహిళల కుటుంబ, విద్యా అవసరాలకు ఆర్థిక భరోసా కల్పించనున్నాయి.

ప్రభుత్వం ప్రారంభించనున్న ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలు టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత నేత ఎన్టీఆర్ పేరుతో అమలు చేయబడనున్నాయి. వీటి ద్వారా డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలకు ప్రత్యేక రుణ సౌకర్యం అందించనున్నారు. కళ్యాణలక్ష్మి పథకం కింద మహిళల పిల్లల వివాహాల కోసం కనిష్ఠంగా రూ.10,000 నుంచి గరిష్టంగా రూ.1,00,000 వరకు రుణం మంజూరు చేయబడుతుంది. ఈ రుణాన్ని 48 నెలల వాయిదాల్లో తిరిగి చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read: AP Assembly 2026: ప్రశ్నోత్తరాలతో హాట్ హాట్ చర్చలు.. మూడు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం!

అలాగే విద్యాలక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా సంఘ సభ్యుల పిల్లల చదువుల కోసం రూ.10,000 నుంచి రూ.1 లక్ష వరకు రుణ సహాయం అందుతుంది. ఈ ప్రయోజనం పొందాలంటే మహిళలు కనీసం ఆరు నెలల పాటు డ్వాక్రా సంఘంలో సభ్యత్వం కలిగి ఉండాలి. ఇక మహిళా సంఘాల కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు యానిమేటర్లు, సీసీలకు ఉచిత మొబైల్ ఫోన్లు అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గ్రామీణ పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న సెర్ప్ (SERP) సంస్థ స్థాపనకు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ రెండు పథకాలు అమల్లోకి వస్తే డ్వాక్రా మహిళలకు ఆర్థిక భరోసా పెరగడంతో పాటు కుటుంబ అవసరాలు, పిల్లల విద్య, వివాహ ఖర్చుల భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.